ఆంధ్రప్రదేశ్‌

పెద్దకొడుకుగా బాధ్యత తీర్చుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 18: పేదల గృహ నిర్మాణం అత్యున్నత సంక్షేమ కార్యక్రమం అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో రూ 80వేల కోట్లతో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని వెల్లడించారు. మనం సొంతిల్లు కట్టుకునేటప్పుడు ఎంతో ఆనందం.. లక్షలాది పేదలకు ఇళ్లు కట్టిస్తే అమితానందం అన్నారు. మంగళవారం గృహనిర్మాణ పథకంపై కలెక్టర్లు, బ్యాంకర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉంటానని హామీ ఇచ్చా.. ఆ హామీని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. అర్బన్ ప్రాంతాల్లో 3లక్షల 83వేల లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని, మిలిగిన వారిని కూడా త్వరగా ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ప్లాట్ల కేటాయింపు కూడా వేగవంతం చేయాలన్నారు. లబ్ధిదారుల వాటాగా రూ 100 కోట్లు చెల్లించారని, పట్టణాల్లో లక్షా 18వేల 700 ఇళ్లకు పైకప్పులు వేసినట్లు తెలిపారు. ఇందులో 72 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి కావచ్చిందన్నారు. ఈ వారం 4270 ఇళ్లకు పైకప్పులు వేశారని, వారానికి 7500 ఇళ్లకు శ్లాబులు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ప్రతి గ్రామం, వార్డులో ‘గృహమిత్ర’లను నియమించాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నమూనా అన్ని జిల్లాలు పాటించాలని సూచించారు. శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరగాలని ఆదేశించారు. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కింద 4లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసినట్లు అధికారులు వివరించారు. మరో 2లక్షల ఇళ్లను త్వరితగతిన నిర్మాణం జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బ్యాంక్ రుణాల మంజూరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. బ్యాంకుల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని అధిగమించాలని కోరారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక అందుబాటులో ఉంచాలని అందుకు మైనింగ్ అధికారులు సహకరించాలని ఆదేశించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి అన్నివిధాల ప్రభుత్వం చేయూతనందిస్తుందని హామీ ఇచ్చారు. ఇల్లు కట్టుకున్న ఆనందం ఆయా కుటుంబాల్లో నిండాలని, టెలీకాన్ఫరెన్స్‌లు ప్రారంభించాక ఇళ్ల నిర్మాణం వేగవంతమైందన్నారు. పట్టణాల్లో లక్ష గృహాలకు త్వరలో సామూహిక గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని నిర్దేశించారు. ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలన్నారు. రోడ్లు, డ్రెయిన్లు, పార్కులు అభివృద్ధి పరచాలని, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండాలనేదే తన అంతిమ లక్ష్యమన్నారు. ఇదే ఎన్టీఆర్ ఆశయంగా చెప్పారు. పెద్దఎత్తున పండుగలా సామూహిక గృహప్రవేశాలు జరగాలని ఆకాంక్షించారు.