ఆంధ్రప్రదేశ్‌

బాక్సైట్‌పై జాతీయ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, జూలై 17: బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడుతుందని, దీనిలో భాగంగానే వచ్చే నెల ఆరో తేదీన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విశాఖ ఏజన్సీలో పాదయాత్ర చేస్తారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి వెల్లడించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆదివారం ఏర్పాటు చేసిన డిసిసి కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం యుపిఎ ప్రభుత్వం ఉపాధి హామీ, గిరిజన హక్కులు, సమాచార హక్కు, పీసా వంటి చట్టాలను చేసిందని గుర్తు చేశారు. ప్రజల మేలు కోసం చట్టాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఈ చట్టాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. పీసా చట్టం ద్వారా గిరిజనులకు సంపూర్ణ హక్కులను కల్పించామన్నారు. షెడ్యూల్ ప్రాంతంలో సైతం చట్టాలను కాలరాస్తున్నారని మండిపడ్డారు. 2013లో చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలకు ఆజ్యం పోశారని, దుబాయ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన రెండు నెలలు తిరగక ముందే బాక్సైట్‌కు అనుకూలంగా 97 జిఓను తీసుకువచ్చారని, ఇందుకు సంబంధించి చంద్రబాబుకు రెండు వేల కోట్ల రూపాయలు ముడుపులు ముట్టాయని ఆరోపించారు. గిరిజన సలహాల మండలి ఏర్పాటు చేయలేని దౌర్భాగ్యస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
60 ఏళ్ళలో క్యాబినెట్‌లో గిరిజన మంత్రి లేని దిక్కుమాలిన ప్రభుత్వం ఇదేనన్నారు. మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. రాహుల్ గాంధీ అంటే ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 2019 నాటికి బిజెపి పార్టీ క్లోజ్ అవుతుందని, కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా అవతరిస్తుందని రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు.
అటవీ హక్కుల సంరక్షణ ఉద్యమంలో భాగంగా చింతపల్లి ప్రాంతంలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్లమనోహర్, మాజీ కేంద్ర మంత్రులు పల్లంరాజు, కిల్లి కృపారాణి, మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, పసుపులేటి బాలరాజు, కొండ్రు మురళి, మాజీ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్సీ విష్ణుప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.