ఆంధ్రప్రదేశ్‌

ఆకాశమే హద్దుగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 17: వినియోగదారుడి కళ్ళు బైర్లుకమ్మే రీతిలో మార్కెట్‌లో పప్పుల ధరలు ఆకాశన్నంటాయి. రెండేళ్లలో పప్పుల ధరలు మూడు, నాలుగు రెట్లు పెరిగాయి. కేవలం రెండు నెలల వ్యవధిలో ఊహించని ధరకు పప్పు ధాన్యాలు చేరాయి. అమాంతం పెరిగిన ధరలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పప్పు దినుసులతోపాటు నిత్యావసరాలైన చక్కెర, ఎండుమిర్చి, వెల్లుల్లి, మసాలా దినుసులకు రెక్కలొచ్చాయి. కేంద్ర, రాష్ట్రాల్లో బిజెపి, తెలుగుదేశం పార్టీలు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలానికి, అంతకు ముందున్న ధరలకు మధ్య వ్యత్యాసాన్ని చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
2014 సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌లో మినపగుళ్లు కిలో ధర 55రూపాయలు కాగా ప్రస్తుత మార్కెట్‌లో 196రూపాయలకు చేరింది. హోటల్ వ్యాపారులు వినియోగించే పొట్టుతీయని సాధారణ మినప్పప్పు కిలో ధర 135 రూపాయల ధర పలుకుతోంది. కందిపప్పు కిలో ధర 2014లో 90రూపాయలు కాగా ప్రస్తుతం 195కు చేరింది. శనగపప్పు కిలో ధర 2014లో 60రూపాయలు కాగా ఇప్పుడు 112రూపాయలకు చేరింది. ఈ పప్పులు ప్రతి ఇంటా నిత్యం తప్పనిసరిగా వాడాల్సినవే! అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని కొనే సాహసం చేయడం లేదని పలువురు వాపోతున్నారు. రెండు, మూడో రకం పప్పులను కూడా మొదటి రకంగా పేర్కొంటూ వ్యాపారులు విక్రయాలు సాగిస్తున్నారు. 2014లో కిలో చక్కెర 30 రూపాయలు కాగా 2016లో 45కు చేరింది. ఎండుమిర్చి కూడా 2014లో కిలో 70 రూపాయలుండగా ఇప్పుడు 190 రూపాయలు పలుకుతోంది. నిత్యావసరాలైన దాదాపు ప్రతి వస్తువు ధర అమాంతం పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు తీవ్ర నిరసనతో రగిలిపోతున్నాయి.
నిత్యావసర సరుకుల్లో ప్రధానమైన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ కొరవడిందని వాపోతున్నారు. 2014లో లీటరు డీజిల్ ధర 45రూపాయలు కాగా ప్రస్తుతం ఆ ధర 65కు చేరిందని, ఇంతకంటే దారుణమైన పెరుగుదలను గతంలో చూడలేదని పలువురు విమర్శిస్తున్నారు.
బ్లాక్ మార్కెట్‌పై నిఘా లోపం...
నిత్యావసరాలైన పప్పుల ధరల నియంత్రణలో ప్రభుత్వాలు తీవ్రంగా వైఫల్యం చెందాయని, సమస్య పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించిన దాఖలాల్లేవంటూ ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బ్లాక్ మార్కెటీర్లపై తగిన నిఘా ఏర్పాటుచేయకపోవడం ఓ ఎత్తయితే, అక్రమంగా నిల్వ చేసేవారు, దొడ్డిదారిలో అక్రమ వ్యాపారాలు సాగించేవారితో అధికారులు కుమ్మక్కవ్వడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.