ఆంధ్రప్రదేశ్‌

చంథ్రబాబు, జగన్‌కు ప్రత్యామ్నాయం మేమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్/నెల్లూరు టౌన్, జనవరి 11 : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యామ్నాయం తామేనని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కెఎ పాల్ అన్నారు. శుక్రవారం ఒంగోలులోని కాపు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న 2019 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అధికారం పగటికలేనన్నారు. అవినీతి నిర్మూలనకు, ప్రజల అభివృద్ధికి, బడుగు, బలహీనవర్గాల వారి శ్రేయస్సే ప్రజాశాంతి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్రమోదీకి, రాష్ట్రంలో చంద్రబాబుకు, ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రజాశాంతి పార్టీ పనిచేస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామన్నారు.
ప్రతి నియోజకవర్గానికి వంద కోట్లు
నెల్లూరు నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీతో పాటు, తెలుగుదేశం పార్టీలను ఓడించడమే ప్రజాశాంతి పార్టీ లక్ష్యమని ప్రజా శాంతి పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఏ.కె.పాల్ అన్నారు. గతంలో వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏడాది కంటే ఎక్కువ అధికారంలో ఉండడని, రోశయ్య సీ ఎం అవుతారని చెప్పానని అలాగే జరిగిందని, 2014లోకూడా దేశ ప్రధాని గా నరేంద్రమోదీ అవుతారని, తమిళనాడు సీ ఎంగా జయలలిత అవుతారని తెలిపానని అలాగే జరిగిందని, మరో నాలుగు నెలలు మాత్రమే చంద్రబాబు సీ ఎంగా, ప్రధానిగా నరేంద్రమోదీ కొనసాగుతారని ఆ తరువాత ఇక వారు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు.
రానున్న ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి రానుందన్నారు.తాను తన సొంత ఛారిటీ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. 10వేల మందిని తన పార్టీలో సభ్యత్వాన్ని నమోదు చేస్తే వారికి ఎమ్మెల్యే సీటును కేటాయిస్తానని తెలపారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గానికి రూ.100 కోట్లు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తానన్నారు.