ఆంధ్రప్రదేశ్‌

ఈబీసీలకు రిజర్వేషన్ మోదీ నాటకం: యనమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 11: ఓడిపోతామన్న భయం తప్ప ఈబీసీలపై మోదీకి ప్రత్యేకమైన ప్రేమ ఏమీ లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ జిమ్మిక్కులు చేస్తున్నారని, ఎన్ని జిత్తులు వేసినా ప్రజలు ఆయనను నమ్మబోరని శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. సంకీర్ణానికి గేట్లు తెరిచామని మోదీ చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. పాత మిత్రులతో దోస్తీకి సిద్ధం అనడం మోదీ దివాళాకోరుతనానికి అద్దం పడుతోందన్నారు. బీజేపీ దుస్థితికి ఆయన ప్రకటన అద్దం పడుతోందని విమర్శించారు. భాగస్వామ్య పక్షాల విశ్వసనీయత కోల్పోయారని, గేట్లు తెరుచుకుని భాగస్వామ్య పార్టీలే వెళ్లిపోయాయని గుర్తుచేశారు. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు అన్నది తాజా జిమ్మిక్కు అని యనమల ఆరోపించారు. 10 శాతం రిజర్వేషన్లను జూలై నుంచి అమలు చేస్తామనడమే ఇందుకు రుజువని తెలిపారు. నాలుగేళ్ల క్రితమే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఇప్పటికే అమలయ్యేదన్నారు. ఆర్థిక వెసులుబాటుపై ఎస్సీ, ఎస్టీలలో అనుమానాలు ఉన్నాయని, బీజేపీ అంటే బలహీన వర్గాలకు భయం పట్టుకుందన్నారు. అంబేద్కర్ చెప్పింది సాంఘికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లని, అంబేద్కరిజానికి మోదీ విధానాలు వ్యతిరేకమని విమర్శించారు. రిజర్వేషన్ నిలబడదని తెలిసీ ఇవ్వటం ఈబీసీలను మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్లపై మోదీ ఎందుకు స్పందించరని, 22ఏళ్లుగా మహిళల డిమాండ్‌ను ఎందుకు పట్టించుకోరని ఆయన ప్రశ్నించారు. శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులపై కేంద్రం చర్యలు ఏవని ప్రశ్నించారు. ఏపీలో కాపుల రిజర్వేషన్లపై, సామాజిక వర్గాల మార్పుపై స్పందించరని విమర్శించారు. ఏపీకి 32వేల కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్ర అధికారులు చెప్పారని, కానీ మోదీ అనుమతి కావాలని తెలిపారని గుర్తుచేశారు. కేంద్రంలోని అధికారుల్లో లోపం లేదని, మోదీలోనే కుట్ర కోణం ఉందని విమర్శించారు. మోదీ కక్షకు ఏపీ ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై మోదీని రాష్ట్ర ప్రతిపక్ష నేత అడగరని, ఏపీ అభివృద్ధి చెందడం ఆయనకు ఇష్టం లేదని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి చెందకూడదని కోరుకునే ఏకైక వ్యక్తి జగన్ అంటూ విమర్శించారు. జగన్ జననేత కాదని, ధననేత అని విమర్శించారు. జగన్ పుస్తకంలో ఒక్క నిజం లేదని, అందుకే ప్రజలు దాన్ని తిరస్కరిస్తున్నారని యనమల స్పష్టం చేశారు.