ఆంధ్రప్రదేశ్‌

ఐదేళ్లు బీజేపీలోనే కొనసాగుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 11: బీజేపీ తరపున పోటీ చేసిన తనకు ప్రజలు ఓట్లేశారని, ఐదేళ్ల పాటు తాను బీజేపీలోనే కొనసాగడం నైతికతగా భావిస్తున్నట్టు బీజేఎల్‌పీ నేత, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పీ విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖలో శుక్రవారం ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేయగా తాను గెలుపొందానన్నారు. ప్రజలిచ్చిన తీర్పును శిరసావహించి, పదవీ కాలం పూర్తయ్యే వరకూ బీజేపీలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోందన్నారు.
పలువురు నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేసిందన్న ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో టీడీపీ విజయం సాధించిందన్నారు. విభజన హామీల్లో ప్రత్యేక హోదా, కడప స్టీల్‌ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, రైల్వే జోన్ మినహా కేంద్ర విద్యాసంస్థలన్నింటితో పాటు హామీల్లో లేనివి కూడా బీజేపీ చేసిందన్నారు.
ప్రత్యేక హోదా స్థానే ప్యాకేజీ ఇస్తానని కేంద్రం హామీ ఇచ్చిందని, కడప స్టీల్‌ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు సాంకేతికంగా సాధ్యం కాదని తేలిందన్నారు. ప్రత్యామ్నాయం చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అంశం కూడా సాంకేతికంగా సాధ్యం కానప్పటికీ రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. అయితే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారానే్న ప్రజలు పూర్తిగా విశ్వసించారని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఎందుకు ఖండించాలని ప్రశ్నించారు.
ప్రస్తుతానికైతే ఉచితంగా ప్రచారం లభిస్తోందని, దీన్ని కొనసాగిద్దామన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే తాను బీజేపీ ద్వారా గెలుచుకున్న ఎమ్మెల్యే పదవీకాలం పూర్తవుతుందన్నారు. అప్పుడు తాను ఏ పార్టీలో చేరేదీ అభిమానులు, ఆంతరంగికులతో చర్చించి ప్రకటిస్తానని వెల్లడించారు.