ఆంధ్రప్రదేశ్‌

గ్రామీణ, గిరిజన ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 11: రాష్ట్రంలో ఐదు వేల గ్రామీణ, గిరిజన ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజితో మార్కెటింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించడానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కృషిచేస్తోందని ఆ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గ్రామీణ ప్రజలు, ఆదివాసీ కుటుంబాల ఆదాయాన్ని ఇతోధికంగా పెంపొందించడానికి వారి ఉత్పత్తులను వివిధ బ్రాండ్ల పేరిట మార్కెటింగ్ చేయడానికి కృషిచేస్తున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నగరపాలక సంస్థ రూ.2.45 కోట్లతో నిర్మించిన బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియాన్ని శుక్రవారం రాత్రి మంత్రి లోకేష్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలో విశాఖ మన్యం గిరిజన రైతులు సాగుచేస్తున్న అరకు కాఫీ నేడు వివిధ దేశాల్లో ప్రాచుర్యం పొందడంతో తోటలు సాగుచేస్తున్న గిరిజనుల ఆదాయం ఇతోధికంగా పెరిగిందన్నారు. అరకు కాఫీ స్ఫూర్తిగా అనేక ఉత్తమ ఉత్పత్తులకు ఐటీడీఏ కృషిచేయాలన్నారు. మల్బరీ సాగుద్వారా గిరిజనుల ఆదాయం హెక్టారుకు రూ.35వేల నుంచి రూ.85వేలకు పెరిగిందన్నారు. దాన్ని రూ.1.5 లక్షలకు పెంపొందించే విధంగా లక్ష్యంగా పెట్టుకుని, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రోత్సాహాన్ని అందిస్తోందని మంత్రి లోకేష్ వివరించారు. ఈ సాగు ద్వారా 50వేల ఆదివాసీ కుటుంబాలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పంచాయతీరాజ్ శాఖకు అనుబంధంగా ఐటీడీఏ ఉత్పత్తులను పెద్ద ఎత్తున తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉత్పత్తయ్యే జీడిపప్పునకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి కలెక్టర్ కార్తికేయ మిశ్రా కృషిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తోందని లోకేష్ పేర్కొన్నారు. గోపీచంద్‌కు భూమి కేటాయించి ప్రోత్సహించినందున ఐదుగురు ప్రపంచ స్థాయి క్రీడాకారులు తయారయ్యారన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాల్లోని స్కూళ్ళలో క్రీడా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి నెల్లూరు జన్మభూమి సభలో వృద్ధాప్య, వితంతు తదితర పింఛన్లను రూ.1000 నుంచి రూ.2000కు పెంచారని, వికలాంగ ఫించన్ రూ.1500 నుంచి రూ.3000కు పెంచారని ప్రజల హర్షధ్వనాల మధ్య లోకేష్ ప్రకటించారు. ఇండోర్ స్టేడియం ప్రారంభించిన అనంతరం ఆయన కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడారు. కార్యక్రమంలో శాసనమండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మహ్మణ్యం, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మేయర్ పంతం రజనీ శేషసాయి, జడ్పీ ఛైర్మన్ తోట నవీన్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శాప్ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, గిరిజన కార్పొరేషన్ ఎండీ టి బాబూరావునాయుడు, స్థానిక కార్పొరేటర్ పితాని లక్ష్మీకుమారి పాల్గొన్నారు.
బ్రాహ్మికి చీరలు తీసుకెళ్తా... బిల్లు ఇవ్వండి
కార్యక్రమానికి ముందు చింతూరు తసర్ సిల్క్‌తో తయారుచేసిన చీరలను మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ఆదివాసీలు ఉత్పత్తిచేసిన ఈ చీరలను కొత్తగా ఐటీడీ ఏ ఆధ్వర్యంలో జీసీసీ మార్కెటింగ్ చేస్తోంది. చీరల ఆవిష్కరణ అనంతరం కొన్ని చీరలను తన సతీమణి బ్రహ్మీకి తీసుకెళ్తానని బిల్లు ఇవ్వాలని అధికారులను కోరారు. చీరల డిజైన్లు బావున్నాయని లోకేష్ పేర్కొనడం విశేషం. అనంతరం మంత్రి లోకేష్ కుట్టు శిక్షణ పొందిన డ్వాక్రా మహిళలకు ఉచితం కుట్టు మిషన్లు పంపిణీ చేసి, సర్ట్ఫికెట్లు అందజేశారు.