ఆంధ్రప్రదేశ్‌

ప్రతి గ్రామానికీ విజన్ డాక్యుమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్టవ్య్రాప్తంగా నిర్వహించిన ఆరో విడత జన్మభూమి - మావూరు కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 10రోజులుగా 16వేల గ్రామస్థాయి ప్రణాళికలను రూపొందించామన్నారు. ఉండవల్లి ప్రజావేదిక సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం ఉంటే సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. పరిష్కార వేదికలో 2వేల మంది ఉద్యోగులు ప్రజాసమస్యల పరిష్కారంలో నిమగ్నమవుతున్నారని చెప్పారు. నవనిర్మాణ దీక్ష, మహా సంకల్పం వంటివి ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతమయ్యాయని గుర్తుచేశారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి సంతృప్తి వచ్చిందన్నారు. పారదర్శకంగా పనిచేయటం వల్లే జన్మభూమి గ్రామసభల్లో అలజడి సృష్టించాలని ప్రయత్నించేవారు తోకముడిచారని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం దీన్ని ఓ పవిత్రమైన కార్యక్రమంగా తీసుకుని పనిచేసిందని ప్రశంసించారు. అధికారి నుంచి గ్రామస్థాయి సేవకుల వరకు ప్రతిఒక్కరూ బాగా పనిచేశారని కితాబిచ్చారు. వయాడక్ట్ భావన బాగా పనిచేసిందన్నారు. ఇది అన్ని స్థాయిల్లో అమలు చేసేందుకు జన్మభూమి స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. గత 10రోజులుగా మండల స్థాయిలో 1880 మొబైల్ బృందాలు, లక్షా 28వేల మంది అధికారులు గ్రామసభలు నిర్వహించారని, 12లక్షల మందికి పైగా ప్రజలు ఆరోగ్య శిబిరాలకు తరలి వచ్చారని, 8లక్షల మంది విద్యార్థులు గ్రామ ప్రణాళికల తయారీలో పాల్గొన్నారని వివరించారు. ఈనెల ఒకటో తేదీ నుంచే సంక్రాంతి ప్రారంభమైందన్నారు. 10 శే్వతపత్రాలపై విస్తృత చర్చ జరిగిందని చెప్పారు. గత నాలుగున్నరేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రజలకు వివరించగలిగామన్నారు. గ్రామ పంచాయతీ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో విజన్ డాక్యుమెంట్లు రూపొందించామని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో ఏయే పనులు చేయగలమో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలసి ప్రణాళికలు రూపొందించటం విశేషమన్నారు. దేశానికే ప్రణాళిక లేని ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామస్థాయిలో ప్రణాళిక రూపొందించటం మొదటిసారి అని చెప్పారు. అన్ని గ్రామాల్లో రూపొందించిన విజన్ డాక్యుమెంట్లన్నీ ఒకే పర్యాయం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారని తెలిపారు. జిల్లా ప్రణాళికలను ఈనెల 21 నుండి విడుదల చేస్తామని, త్వరలో రాష్టస్థ్రాయి ప్రణాళికను వెల్లడిస్తామని ప్రకటించారు. జన్మభూమి మొత్తంగా 5,65,616 ఫిర్యాదులు రాగా, అందులో 33,888 అక్కడికక్కడే పరిష్కరించారన్నారు. పేదరికం నిర్మూలన, పింఛన్లు, ఇళ్ల స్థలాలపై ఎక్కువ శాతం వినతులు వచ్చాయన్నారు. అన్ని గ్రామాల్లో వౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చామని, సంక్షేమంలో గరిష్ఠ ప్రయోజనాలు అందిస్తున్నామని తెలిపారు. పేదలకు ఇళ్లు, ఉన్నత విద్యకు ఆర్థిక సాయం, పెళ్లి కానుకలు, బీమా సదుపాయం, అన్న క్యాంటీన్లతో ఆకలి తీరుస్తున్నామని వివరించారు. చేతివృత్తులు, కుల వృత్తులకు పరికరాలు అందించి డప్పు కళాకారులకు పింఛన్లు మంజూరు చేస్తున్నామని, సమాజంలో ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గాడితప్పిన పాలనను దారిలో పెట్టేందుకు సంపద సృష్టించామని, సృష్టించిన సంపద వల్ల ఆదాయం పెరుగుతుందన్నారు. మళ్లీ ఆ ఆదాయాన్ని అవసరమైన వర్గాలకు చేరేలా చూస్తామన్నారు. ఇందుకోసం నాలుగున్నరేళ్లు పట్టిందన్నారు. ఆదాయం కోల్పోయిన జనాభాకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, విభజన చట్టంలో పెట్టిన అంశాలేవీ పట్టించుకోకుండా వదిలేశారని ధ్వజమెత్తారు. ఆ బాధ్యత ప్రధానికి ఉందా, లేదా? అని నిలదీశారు. పేదవారికి పింఛన్లు ఇచ్చి రుణమాఫీ చేశామనే నెపంతో రాష్ట్రానికి రావాల్సిన రూ. 16వేల కోట్లలో కోత విధించారని మండిపడ్డారు. అయినా స్వశక్తితో రాష్ట్రం ఎదిగిందన్నారు. 660 పురస్కారాలు అందుకోవటంతో పాటు తుపాన్లను అధిగమించి ప్రజలను ఆదుకోగలిగామన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు దోచిన వ్యక్తి వల్లే రాష్ట్రంలో పెట్టుబడులకు మొదట పారిశ్రామికవేత్తలు సంశయించారన్నారు. దీనివల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఇప్పుడు ఒకేరోజు రెండు పెద్ద సంస్థలు లక్ష కోట్ల పెట్టుబడులకు ముందుకు రావటం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఓ నమ్మకం, విశ్వాసం.. అదే రాజధాని అమరావతి అని వ్యాఖ్యానించారు. రూ. 43వేల కోట్ల విలువైన 35వేల ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు అందించారన్నారు. ప్రజారాజధానితో పాటు పోలవరం నిర్మాణం, నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామన్నారు. త్వరలో ఐదు నదుల మహాసంగమాన్ని చేపడతామని వెల్లడించారు. గజరాత్ కంటే ముందుకు సాగుతున్నామనే అక్కసుతోనే మోదీ కుతంత్రాలు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులను స్వాగతించి ఉపాధి కల్పనతో పాటు అభివృద్ధి సాధిస్తే 6లక్షల కోట్ల అవినీతి జరిగిందని, మేం చెప్పినందువల్లే పింఛన్లు పెంచారని ప్రతిపక్ష నేత జగన్ వ్యాఖ్యలు చేయటం హాస్యాస్పదమన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే ఛీకొడతారన్నారు. ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోతే మేమూ గట్టిగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో జరిగినన్ని సంక్షేమ కార్యక్రమాలు ధనిక రాష్ట్రం తెలంగాణలో జరగలేదని, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఏంచేశారో తేల్చాలన్నారు. హోదా వద్దన్న కేసీఆర్‌తో కలసి సాధిస్తామని జగన్ ప్రజలను మభ్యపెట్టటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి ఏరకంగా హోదా తెస్తారో ముగ్గురు మోదీలు తేల్చాలని డిమాండ్ చేశారు. జగన్ నిర్వాకంతో అత్యంత విలువైన 29వేల ఎకరాల వాన్‌పిక్, 15వేల ఎకరాల లేపాక్షి, ఓబుళాపురం భూములు కోర్టు కేసుల్లో ఉన్నాయన్నారు. పాలనానుభవంలేని ఆయన హామీలతో ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ పాలనలో 200 రూపాయల పింఛను విదిలించి పదేళ్లు ప్రచారం చేసుకున్నారని, తమ ప్రభుత్వం పదిరెట్లు పెంచిందని గుర్తుచేశారు. జగన్‌కు బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లలపై అవగాహన లేదని విమర్శించారు. ఎన్టీఆర్ వైద్యసేవలను రూ. 5లక్షలకు పెంచామని, ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామని చెప్పారు. రెండు చేతులులేని దివ్యాంగులకు నెలకు రూ. 10వేలు పింఛను మంజూరు చేసే అంశం పరిశీలనలో ఉందని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎక్కడా రాజీపడే ప్రసక్తిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు