ఆంధ్రప్రదేశ్‌

విశాఖ జిల్లాలో జోరుగా భూ సమీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 12: విశాఖ జిల్లాలో విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) భూ సమీకరణను పరుగులెత్తిస్తోంది. గృహ నిర్మాణంతో పాటు ఇతర అవసరాల నిమిత్తం భూ సమీకరణకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో వీఎంఆర్‌డీఏ యంత్రాంగం భూ సమీకరణను వేగవంతం చేస్తోంది. పెందుర్తి మండలం ముదపాకలో భూ సమీకరణ అంశం వివాదస్పదం కావడంతో కొన్ని నెలల పాటు స్తబ్దతగా ఉన్న ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో ముందుకెళ్లాలన్న నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం అవుతోంది. ఇక్కడ భూములను ముందుగా ప్రైవేటు వ్యక్తులు సమీకరించే ప్రయత్నం చేయగా విపక్షాలు అడ్డుకున్నాయి. అప్పటికి ప్రభుత్వంలో భాగసామ్యంగా ఉన్న బీజేపీ సైతం ముదపాక భూముల సేకరణను అడ్డుకుంది. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముదపాక భూ సమీకరణకు సంబంధించిన ప్రభుత్వం అప్పట్లో జారీ చేసిన జీఓను సైతం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక వైసీపీ, వామపక్ష పార్టీలు ముదపాక భూములను సేకరించే విషయంలో పోరాటాలే చేశాయి. ఇక ట్రైజంక్షన్ భూ సమీకరణకు వామపక్షాలు తీవ్ర అభ్యంతరం తెస్తున్నాయి. ఇన్ని అభ్యంతరాల నడుమ ప్రభుత్వం పెందుర్తి, భీమునిపట్నం నియోజకవర్గాల్లో భూ సమీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వీఎంఆర్‌డీఏ భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో భూ సమీకరణను వేగవంతం చేస్తోంది. పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని ముదపాకలో 560.66 ఎకరాలు, ఎస్‌ఆర్ పురంలో 95 ఎకరాలు భూ సమీకరణకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఎస్‌ఆర్ పురంలో భూ సమీకరణపై వీఎంఆర్‌డీఏ కమిషనర్ బసంత్ కుమార్ గ్రామసభ నిర్వహించి అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. భీమిలి నియోజకవర్గం, భీమునిపట్నం మండలం కొత్తవలసలో 95 ఎకరాల భూ సమీకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. ఇదిలా ఉండగా ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్ కాంప్లెక్స్, సమీకృత హౌసింగ్ తదితర ప్రాజెక్టుల కోసం గాజువాక, పరవాడ, సబ్బవరం మండలాల పరిధిలోని ఐదు గ్రామాల్లో 900 ఎకరాల భూ సమీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఒక్క అడుగు ముందుకు వేయలేని పరిస్థితులు ఉన్నాయి.
ఇక్కడ వామపక్ష పార్టీలు రైతుల నుంచి భూ సమీకరణకు అభ్యంతరం తెలుపుతున్నారు. 2013 భూ సేకరణ చట్టం అనుసరించి పరిహారం చెల్లించి భూములు తీసుకోవాల్సిందిగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకటి, రెండు సార్లు కలెక్టర్, వీఎంఆర్‌డీఏ కమిషనర్ ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులను ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ట్రై జంక్షన్ భూ సమీకరణ కంటే ముందే భీమిలి, పెందుర్తి ప్రాంతాల్లో భూములు సేకరించాలని వీఎంఆర్‌డీఏ భావిస్తోంది.