ఆంధ్రప్రదేశ్‌

పంచాయతీ ఎన్నికలకై 23 తర్వాత ప్రత్యక్ష పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 12: హైకోర్టు ఆదేశాలకనుగుణంగా ఈనెల 23వ తేదీ లోపుగా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను చేపట్టని పక్షంలో ఓ వైపు కోర్టు ధిక్కారం కింద హైకోర్టును ఆశ్రయించడంతోపాటు మరో వైపు ప్రత్యక్ష పోరుకు సన్నద్ధమవుతామని లోకల్ గవర్నమెంట్స్ చాంబర్ జాతీయ అధ్యక్షులు మామిడి అప్పల నాయుడు హెచ్చరించారు. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్రను కలిసి తర్వాత ఆయన శనివారం నాడిక్కడ మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువు ఈ నెల 23వ తేదీతో ముగియనున్నదన్నారు. అసలు ప్రత్యేకాధికారి పాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 90 రాజ్యాంగ విరుద్ధమని, ఆ జీవో చెల్లదని కూడా హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 23వ తేదీ నుంచి మాజీ సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌చార్జీలుగా కొనసాగించాలని అప్పలనాయుడు డిమాండ్ చేశారు. తీర్పును ప్రభుత్వం గౌరవించని పక్షంలో ఈ నెల 23వ తేదీన ప్రత్యక్ష పోరుకు, న్యాయ పోరాటానికి దిగుతామంటూ హెచ్చరించారు.