ఆంధ్రప్రదేశ్‌

కోటప్పకొండ పెయింటింగ్స్ అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 12: ప్రకృతి ప్రేమికులు, కళారాధకులను కోటప్పకొండ పెయింటింగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయని రాష్ట్ర శాసనసభాపతి కోడెల శివప్రసాద్ కొనియాడారు. శనివారం విజయవాడ బాపూ మ్యూజియంలో ప్రముఖ చిత్రకారుడు, టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ మల్లిఖార్జున్ చిత్రీకరించిన కోటప్పకొండ కళాఖండాలను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా కోడెల మాట్లాడుతూ విశిష్ట స్థానం ఉన్న కోటప్పకొండ ప్రాశస్థ్యాన్ని చిత్రీకరించి ప్రజల ముంగిటకు తీసుకురావడం చిత్రకారుడు, టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మల్లిఖార్జున్ సానుకూల దృక్పథానికి నిదర్శనమని కితాబిచ్చారు. ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజులు కోటప్పకొండ వద్ద కొండ ఉత్సవాలు భారీగా నిర్వహించనున్నామన్నారు. 130 ఎకరాల పరిధిలో ఎకో టూరిజం పెంపొందించేలా ఉత్సవాలు జరుగుతాయన్నారు. కోటప్పకొండకు వచ్చిన ప్రతిఒక్కరికీ దట్టమైన అడవుల్లో సంచరించిన అనుభూతి కలుగుతుందని, దీనికి తగినట్లు కొండ దిగువ భాగంలో చిన్న పిల్లలు నుండి పెద్దల వరకు ఆనందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ రెండు రోజులూ ఫుడ్ ఫెస్టివల్, గుర్రపు స్వారీ, ఏనుగు అంబారీతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తాయని కోడెల వివరించారు. పెయింటింగ్ బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ డైరెక్టర్ ఈమని శివనాగిరెడ్డి, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి గోళ్ల నారాయణరావు, విశ్రాంత అధ్యాపకులు వెన్నా వల్లభరావు, జీ సాంబశివరావు పాల్గొన్నారు.