ఆంధ్రప్రదేశ్‌

వైద్య ఆరోగ్య శాఖలో 3,400 పోస్టుల భర్తీకి 15 రోజుల్లో నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 12: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో 3,400 ఉద్యోగాలను భర్తీ చేయటానికి 15 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించే క్యాన్సర్, కార్డియాలజిస్టు భవన నిర్మాణ పనులకు శనివారం సాయంత్రం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలతోపాటు ప్రాథమికంగా ఆధునిక వైద్యం అందించటానికి 1200 పీహెచ్‌సీల్లో వైద్యులను నియమిస్తామని, 300 మంది వివిధ విభాగాల్లో స్పెషలిస్టు వైద్యులను నియమిస్తామని, 1900 ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటానికి త్వరలోనే మెంటల్ హెల్త్‌పై కూడా దృష్టి సారిస్తామని చెప్పారు. ఎటువంటి అనారోగ్యం లేకపోయినా శరీరంలో ఏ విధమైన వ్యాధి లక్షణాలు ఉన్నాయో ప్రాథమిక దశలోనే గుర్తించటానికి ప్రతి పీహెచ్‌సీలో మాస్టర్ హెల్త్ చెకప్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, బీపీ, షుగర్, ఇతర వ్యాధులకు సంబంధించి అవసరమైన వైద్య పరీక్షలను చేయటానికి క్షేత్ర స్థాయిలో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించామని మాలకొండయ్య చెప్పారు. అన్ని పీహెచ్‌సీలను టీచింగ్ ఆసుపత్రులుగా తీర్చిదిద్ది, మంచి ఆరోగ్యంతోపాటు వైద్య సేవలు అందిస్తామని, గతంతో పోలిస్తే రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులలో పరిశుభ్రత పెరిగిందని, ఆసుపత్రులలో మరుగుదొడ్లను కూడా ఆధునిక వసతులు కూడా తీర్చిదిద్దామని ఆమె చెప్పారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని, వారం వారం కలెక్టర్ తనను కలిసి కోరుతున్నారని, ఈ విషయంపై ప్రభుత్వం కళాశాల ఏర్పాటుకు అనుమతి మంజూరు చేసిందని, త్వరలో జరిగే క్యాబినెక్ సమావేశానికి ఏలూరుకు మెడికల్ కళాశాల ప్రతిపాదనలను తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని మాలకొండయ్య తెలిపారు. పశ్చిమ గోదావరికి సంక్రాంతి కానుకగా మెడికల్ కళాశాలకు అనుమతి లభించినట్లేనని ఆమె పేర్కొన్నారు.