ఆంధ్రప్రదేశ్‌

తెలుగుదేశం, చంద్రబాబుపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 14: సోషల్ మీడియాలో షర్మిలపై జరుగుతున్న ప్రచారాన్ని తాము ఖండిస్తున్నామని, షర్మిల తమపై ఆరోపణలు చేయడం దురదృష్టకరమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే నీచ సంస్కృతి వైసీపీకే ఉందని, తమ అధినేత చంద్రబాబుది అలాంటి సంస్కృతి కాదన్నారు. వారి ఆరోపణలకు సాక్ష్యాధారాలుంటే బయటపెట్టాలన్నారు. రాష్ట్ర పోలీసులకు సాక్ష్యాధారాలు ఇస్తే దోషులపై చర్యలు తీసుకుంటారన్నారు. తెలుగుదేశం నాయకులపై సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు ఫిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తమ నాయకులపై సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు జగన్మోహన్‌రెడ్డి ప్రొఫైల్ పెట్టుకుని దుష్ప్రచారం, అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టినప్పుడు సాక్ష్యాధారాలు సహా పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు వారిని అరెస్టు చేస్తే వైసీపీ నాయకులు, లాయర్లు పూచీకత్తు, జామీన్లు ఇచ్చి విడిపించిన సందర్భాలున్నాయని, సాక్ష్యాధారాలతో సహా తాము నిరూపిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబుపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనికి జగన్, షర్మిల్ బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు. ఎవరో సైకోలు చేసిన పనికి తమ పార్టీని, చంద్రబాబును బురదలోకి లాగడం సరికాదని వైవీబీ అన్నారు. జగన్ దాడి కేసు ఎన్‌ఐఏకు అప్పగిస్తే తమకేమీ భయం లేదన్నారు. కోడికత్తి కేసును సీఐఏతో విచారణ జరుపుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. ఎన్‌ఐఏ విచారణ రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో కేంద్రం అనుచిత జోక్యం చేసుకోవడమేనని వ్యతిరేకించారు. ఆంధ్ర ప్రజల సార్వభౌమత్వానికి ఇది మచ్చ అని ఖండించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నాడు మోదీ ఎన్‌ఐఏ విచారణను ఎందుకు వ్యతిరేకించాడో జీవీఎల్, కన్నా, బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. ఆంధ్ర బీజేపీ నాయకులు తెలుగు ప్రజలకు శనిగ్రహాల్లా దాపురించారని ఆయన విమర్శించారు. దగ్గుబాటి కుటుంబం వైసీపీలోకి ప్రవేశించడంతో మోదీ - జగన్‌ల లాలూచీ, కుట్ర రాజకీయాలు బహిర్గతం అవుతున్నాయన్నారు. బీజేపీ, వైసీపీ పరస్పరం లాలూచీతో నాయకులను పంచుకుంటున్నాయని, చంద్రబాబు పింఛన్ల పెంపు పంచ్‌తో వైసీపీకి దిమ్మ తిరిగిపోయిందన్నారు. పింఛన్ల పెంపుతో 60లక్షల పేద కుటుంబాలు నిజమైన సంక్రాంతి జరుపుకుంటున్నాయని వైవీబీ స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో పార్టీ నాయకులు షేక్ మొహ్మద్ ఫైజాన్, తెలుగు యువత నాయకులు కొండా ప్రవీణ్, యలమంచిలి ప్రసాద్ పాల్గొన్నారు.