ఆంధ్రప్రదేశ్‌

కో‘ఢీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 14: గోదావరి జిల్లాల్లో కోడి చట్టాన్ని ‘ఢీ’ కొట్టింది. ఆడతామని పోలీసులతో పందెం కట్టింది. పోలీసు యంత్రాంగం నిర్బంధం మధ్య సోమవారం భోగి రోజు జిల్లాలో పందేలు మొదలయ్యాయి. సోమవారం వేకువ జాము నుంచి పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ మధ్యాహ్నం నుంచి పందేలు మొదలయ్యాయి. చాలావరకు బరులు పోలీసులకు తెలియకుండా తయారు చేశారు. పోలీసులు పసిగట్టిన కోడిపందేల బరుల వద్దకు వెళ్లే పోలీసులు నిర్వాహకులను, పందెం రాయుళ్లను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు.
గోదావరి జిల్లాలో కోనసీమ, మెట్ట, మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి యధేచ్ఛగా సాగాయి. కోడి పందెం బరులకు అనుబంధంగా నంబర్ గుండాట, పేకాట తదితర జూదాలతో పాటు మద్యం అమ్మకాలు కూడా జోరుగానే మొదలయ్యాయి. జిల్లాలో మొదటి రోజు ఇటు పందేలు, అటు అనుబంధ జూదాలు కలిపి దాదాపు రూ.50 కోట్ల వరకు జరిగి ఉంటాయని అంచనా వేశారు.
కోర్టు ఆంక్షలు, పోలీసు దాడులు ఉన్నప్పటికీ జిల్లాలో భోగి రోజు సుమారు 90 బరుల్లో పందేలు జరిగాయి. చివరి నిముషంలో రాజకీయ వత్తిళ్లకు పరిమితమయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే పలు కేసులు పెట్టి దాదాపు భోగిరోజు వరకు చాలా హడావిడి చేశారు. అయితే పండగ మూడు రోజులైనా తప్పదన్నట్టుగా రాజకీయ వత్తిళ్ళ నేపధ్యంలో పోలీసులు స్టేషన్లకు పరిమితమైనట్టు తెలిసింది.
కోనసీమలోని ఐ పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, అల్లవరం, ఉప్పలగుప్తం, సఖినేటిపల్లి, రాజోలు, మల్కిపురం, అంబాజీపేట మండలాల్లో కోడి పందేలు, గుండాట, పేకాట, మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. కాట్రేనికోన మండలానికి ఇతర ప్రాంతాల నుంచి పందెం కాసేవారు రాకుండా పోలీసులు పికెటింగ్ కూడా నిర్వహించారు. కాట్రేనికోనలో చెయ్యేరు, ఉప్పూడి, రాజుపాలెం, పాత ఇంజరం, కొత్తలంక, ఎదుర్లంక, మూలపాలెం, గుత్తెనదీవి, కేశనకుర్రు, నడవపల్లి, ఐ పోలవరం మండలం అన్నంపల్లి, అల్లవరం మండలం కొమరిగిరి, గోడిలంక తదితర గ్రామాల్లో పందేలు జరిగాయి. కాట్రేనికోన మండలం గెద్దనాపల్లి, అల్లవరం గోడిలంకలో భారీ స్థాయిలో జరిగినట్టు తెలిసింది.
ఎన్నికలు సమీపిస్తోన్న క్రమంలో ప్రజా ప్రతినిధులెవరూ పందేల ఛాయలకు కూడా వెళ్లకూడదని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది. దీంతో ఎమ్మెల్యేలెవరూ పందేల జోలికి వెళ్లలేదు. అనపర్తి మండలంలో ఉదయం నుంచే కోడిపందేలు ఆరంభమయ్యాయి. పోలీసులు ఉదయం నుంచీ ఆయా బరుల వద్ద హడావిడి చేశారు. అనంతరం రాజకీయ వత్తిళ్లతో పోలీసులు పక్కకు తప్పుకున్నారని తెలిసింది. అయితే ఇప్పటికే పోలీసులు ముందస్తు హెచ్చరికల నేపధ్యంలో కేసులు నమోదు చేశారు కాబట్టి అనంతరం ఎదురయ్యే కోర్టు సమస్యలకు కూడా తాము కేసులు పెట్టామని చెప్పుకునేందుకు సరిపోతుందన్నట్టు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలిసింది. మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి కోడిపందేలు జోరందుకున్నాయి. అనపర్తి మండలం పేరారామచంద్రపురం, మహేంద్రవాడ, అనపర్తి, దుప్పలపూడి, రాయవరం మండలం కొప్పవరం, పులగుర్త ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించారు. పోలీసులు వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా హడావిడి చేశారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ, తాడిపూడి, లొల్ల, పులిదిండి, పేరవరం ప్రాంతాల్లోనూ, పిఠాపురం మండలం వీరవాడ, రంపచోడవరం మండలం వేములకొండ, సోకులగూడెం గ్రామాల్లో కోడిపందేలు నిర్వహించారు. జగ్గంపేట మండలం మర్రిపాకలో పామాయిల్ తోటలో కోడిపందేలు యధేచ్ఛగా సాగాయి. ఉప్పలగుప్తం మండలం కూనవరం, చల్లపల్లి, గొల్లపల్లి, భీమనపల్లి ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా జరిగాయి. సామర్లకోట మండలం వేట్లపాలెం, వీకే రాయవరం, రాజానగరం మండలం రాజానగరం, దివాన్‌చెరువు, నరేంద్రపురం, పుణ్యక్షేత్రం, కొత్తపేట మండలం కొత్తపేట, రంపచోడవరం, రాజవొమ్మంగి, మారేడుమిల్లి, వై రామవరం, దేవీపట్నం మండలాల్లోనూ అరకొరగా కోడిపందేలు నిర్వహించారు. కోరుకొండ, గోకవరం మండలాల్లో ఒక చిన్న తరహాలో కోడిపందేలు యధేచ్ఛగా సాగాయి.
చిత్రం..మురమళ్ల బరిలో కోడి పందేలు దృశ్యం