ఆంధ్రప్రదేశ్‌

పెరిగిన చలి గాలులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 14: తెలుగు రాష్ట్రాల్లో చలి గాలుల తీవ్రత పెరుగుతోంది. పలు పట్టణాల్లో పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. సాయంత్రం అయ్యే సరికి చలి తీవ్రత మరింత పెరుగుతూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. సైబీరియా నుంచి వచ్చే గాలులు తగ్గుముఖం పట్టినప్పటికీ, సముద్రంపై నెలకొన్న పీడనం పెరిగి పొగమంచు కమ్ముకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఉత్తరాదిలో పెరుగుతున్న చలి తీవ్రత ఆంధ్రప్రదేశ్‌కు పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల వరకూ కొనసాగుతోంది. దీని ప్రభావం కూడా కొంతమేర ఆంధ్రప్రదేశ్‌పై నెలకొంటోంది. ఈ పరిస్థితి మార్చి నెలాఖరు వరకూ కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భానుకుమార్ ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంటుందన్నారు. దీనితో పాటు విశాఖ పరిసరాల్లో పారిశ్రామిక వాతావరణం కూడా పొగమంచు దట్టంగా కమ్ముకోవడానికి ఒక కారణంగా పేర్కొన్నారు. ఇక గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణాలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొంటున్నారు. కోస్తాలో 2 డిగ్రీల వరకూ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా విశాఖలో సోమవారం ఉదయం దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఉదయం 9 గంటల వరకూ పొగమంచుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. పొగమంచు కారణంగా విశాఖ విమానాశ్రయంలో ఉదయం రావాల్సిన పలు విమానాలు 20 నుంచి 30 నిముషాలు ఆలస్యంగా నడిచాయి. మధ్యాహ్నం 2.10 గంటలకు విశాఖ వచ్చి 2.40 గంటలకు తిరిగి వెళ్లాల్సిన బెంగళూరు-విశాఖ ఇండిగో విమానం రద్దయింది.