ఆంధ్రప్రదేశ్‌

కేసీఆర్ డబ్బు మూటలతో జగన్‌కు ఓట్లు పడవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 17: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన డబ్బు మూటల సహాయానికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వైసీపీ నేత జగన్‌కు ఓట్లు వేయరని టీడీపీ కేంద్రపార్టీ కార్యదర్శి, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు 25 ఎంపీ స్థానాల్లో టీడీపీనే గెలిపిస్తారని, రాబోయే ప్రధానిని చంద్రబాబునాయుడే నిర్ణయిస్తారంటూ 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ముందస్తుగానే వెల్లడించారు. మోదీకి సేవలందించేందుకు ఫెడరల్‌ఫ్రెంట్ ఫ్రెండ్స్‌గా కేసీఆర్ - జగన్‌లు జతకట్టారన్న విషయాన్ని దేశంలో అన్నీ రాష్ట్రాల రాజకీయ విశే్లషకులు గమనిస్తున్నారన్నారు. గురువారం ఎంపీ రామ్మోహన్ నాయుడు ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. వైసీపీ ఎంపీల రాజీనామాలను సాగదీసి ఉపఎన్నికలు రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషించిన జగన్ మోదీకి పరోక్షంగా సేవలందించారని ఆరోపించారు. రాయలసీమ ప్రాణాధారమైన పోతిరెడ్డిపాడుపై విషం కక్కిన కేసీఆర్‌తో జగన్ చేతులు కలపడం ఐదు కోట్ల ఆంధ్రులకు ద్రోహం చేసినట్టేనంటూ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు కీలకమైన మండలాల విలీనంపై నేటికీ విమర్శలు గుప్పిస్తున్న కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు సాహసిస్తే ఆంధ్రా ఓటర్లు వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా హరీష్‌రావు చేసిన ప్రకటన ఖండించని కేసీఆర్‌తో జగన్ చేతులుకలిపి ఏపీ ప్రయోజనాల కోసం షరతులు లేకుండా ప్రత్యేక హోదాకు మద్దతు కోరగలరా? అంటూ రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. మోదీ వ్యవహార శైలి, పాలనపరమైన అంశాలపై కేటీఆర్, జగన్ ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేని పరిస్థితులే వీరంతా ఆంధ్రాపై కుట్రపన్నుతున్నారంటూ రుజువుచేస్తోందన్నారు. మోదీ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు చేస్తున్న కుట్రలో భాగమే ఫెడరల్‌ఫ్రంట్ రాజకీయ వ్యూహం అంటూ ఆరోపించారు. అందుకే దేశంలో ప్రధాన పార్టీలన్నీ కేసీఆర్ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వలేదన్నారు. అసలు కాంగ్రెస్ భాగస్వామ్యం లేకుండా మోదీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో కేంద్రంలో ఏర్పడటం సాధ్యం కాదంటూ జోష్యం చెప్పారు. జగన్‌కు ఇప్పుడున్న ఐదుగురు ఎంపీలు కూడా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నిలబడే స్థితి లేదన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓట్లు వేసిన మైనార్టీ, దళితులు, బీసీలు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు వేయరని, కేసీఆర్‌కు ఓటు వేస్తే మోదీకి వేసినట్టేనని ఆ వర్గాలకు తెలుసన్నారు. మొత్తంమీద 2019 ఎన్నికల్లో కేసీఆర్, వైసీపీలకు ఇప్పుడున్న ఎంపీ స్థానాలు సంఖ్య నిలబడవన్నారు. జగన్, కేసీఆర్ కుట్రలను ఐదుకోట్ల ఆంధ్రులు బలంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేసులు మాఫీ చేసుకునేందుకు జగన్, భారీ స్కామ్‌లు కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ కలిసిన ఫెడరల్‌ఫ్రంట్ ఏపీ ముఖ్యమంత్రిని ఏమీ చేయలేవన్నారు.