ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో ఒంటరిగానే పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంపల్లె, జనవరి 17: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. గురువారం కడప జిల్లా వేంపల్లెలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి లక్షల కోట్ల నిధులు కేంద్రం మంజూరుచేసిందన్నారు.
కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం కేంద్రం ఏమీ ఇవ్వలేదని ఆబద్దాలు చెబుతున్నారన్నారు. సొమ్మొఒకరిది సోకొకరిది అన్న చందనంగా నిధులు కేంద్రం ఇస్తే చంద్రబాబు వాటిని జల్సాలకు వినియోగించారన్నారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నిధుల గురించి ప్రజలకు వివరించాలన్నారు. హైకోర్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ఇచ్చిందన్నారు. రాయలసీమ అభివృద్ధి చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. ఇష్టం లేకనే హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయలేదన్నారు. సీమలో హైకోర్టు ఏర్పాటుచేయాలని బీజేపీ పలుమార్లు ప్రభుత్వాన్ని కోరిందన్నారు. ఏపీ అభివృద్ధి విషయంలో కేంద్రం సూచనలను బాబు అస్సలు లెక్కచేయడం లేదన్నారు. ఆయన ఒక డిక్టేటర్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. కొన్ని పత్రికలు పనిగట్టుకుని చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నాయన్నారు. దీంతో చంద్రబాబు పూర్తిగా రెచ్చిపోతున్నారన్నారు. కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి దొంగ దీక్షలు చేయించి హడావుడిగా శంకుస్థాపన జరిపారన్నారు. విశాఖ రైల్వేజోన్, దుగ్గరాజపట్నం ఓడరేవు, కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ వాటి నిర్మాణం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుగా చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబుతోపాటు రాష్ట్ర అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరించడం లేదన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుష్మారెడ్డి, నాయకులు విజయలక్ష్మి, రామచంద్రారెడ్డి, మాకం అశోక్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శులు శశిభూషణరెడ్డి, నాగేంద్రప్రసాద్, రాష్ట్ర కోశాధికారి సన్యాసిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుబ్బారెడ్డి, పులివెందుల అసెంబ్లీ కన్వీనర్ భానుప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ