ఆంధ్రప్రదేశ్‌

కుక్కను చంపి.. ముక్కలు చేసి.. కాల్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: నగరంలోని ముషీరాబాద్‌లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు బాలురు చిన్న కుక్కపిల్లను చంపి.. ముక్కలుగా చేసి కాల్చారు. అంతటితోనే ఆగకుండా ఈ ఘటనను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఇటీవల తమిళనాడులో ఓ కుక్కను వైద్య విద్యార్థి మేడ పైనుంచి కిందికి విసిరేసిన సంఘటన మరువకముందే ముషీరాబాద్ డయారా కమాన్‌లోనూ అలాంటి సంఘటన చోటుచేసుకోవడం జంతు ప్రేమికులను కలచివేసింది. ఈ దృశ్యాలను చూసిన పీపుల్స్ ఫర్ యానిమల్స్ ప్రతినిధి శ్రేయ ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసిన దృశ్యాలను సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలించి ముగ్గురు మైనర్లపై కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా సరదాకోసమే తాము ఈ పనిచేసినట్టు చెప్పారు. ఎస్‌ఐ భాస్కర్, క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఈ సంఘటన మంగళవారం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ముషీరాబాద్ పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా 1960లోనే జంతు సంరక్షణ చట్టం తీసుకొచ్చారని 55ఏళ్లు గడచినా ఇప్పటికీ ఆ చట్టం సక్రమంగా అమలు కావడం లేదని పీపుల్స్ ఫర్ యానిమల్స్ ప్రతినిధి వాసంతి ఆవేదన వ్యక్తం చేశారు. జంతువులను చంపిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఒకవేళ నిందితులను అరెస్టు చేసినా రూ.50ల జరిమానాతో విడుదలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బాపురెడ్డికి దాశరథి
కృష్ణమాచార్య అవార్డు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 20: ప్రముఖ కవి, పదవీ విరమణ చేసిన ఐఎఎస్ అధికారి డాక్టర్ జె. బాపురెడ్డిని ప్రతిష్టాత్మకమైన ‘దాశరథి కృష్ణమాచార్య అవార్డు- 2016’కు తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం పేరుతో బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. దాశరథి కృష్ణమాచార్య జయంతి అయిన జూలై 22న ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును అందచేస్తారు. అవార్డు కింద 1,01,116 రూపాయల నగదుతోపాటు మొమెంటో, శాలువాతో సత్కరిస్తారు. దాశరథి కృష్ణమాచార్య అవార్డుకోసం రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అన్ని కోణాల్లో పరిశీలించి బాపురెడ్డిని ఎంపిక చేసింది. జె. బాపురెడ్డి మెదక్, వరంగల్ జిల్లాల కలెక్టర్‌గా, సిఎం కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా, ఇండియన్ టుబాకో బోర్డు ఇడిగా, దేవాదాయ శాఖ కమిషనర్‌గా, ఎపిఐఐసి విసి అండ్ ఎండిగా, ఎపిపిఎస్‌సి మెంబర్‌గా పనిచేశారు. సంగీత నాటక అకాడమీ స్పెషల్ ఆఫీసర్‌గా, ఆల్ ఇండియా కల్చరల్ ఫెస్టివల్ ప్రధాన కార్యదర్శిగా, తొలి ప్రపంచ తెలుగు మహాసభల కార్యదర్శిగా పనిచేశారు. అలాగే నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల హైపవర్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. సాహిత్య అకాడమీ తదితర సంస్థలతో కలిసి పనిచేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో 36 పుస్తకాలు రాశారు. వివిధ పత్రికల్లో ఆయన రచనలు ప్రచురితం అయ్యాయి. ఆకాశవాణిలో ఆయన రచనలు అనేక పర్యాయాలు ప్రసారం అయ్యాయి. దాదాపు 40కి పైగా దేశాల్లో పర్యటించి సాహిత్యం, సాంస్కృతిక, వాణిజ్య అంశాలపై ప్రసంగాలు చేశారు. ఇప్పటికీ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ సలహాదారుగా, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సలహా మండలిలో సభ్యుడిగా పనిచేస్తున్నారు.

మా సర్వీసులను
తెలంగాణకు కేటాయించండి
క్యాట్‌ను ఆశ్రయించిన
నలుగురు ఐపిఎస్‌లు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 20: తమ సర్వీసులను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా కోరుతూ నలుగురు ఐపిఎస్ అధికారులు బుధవారం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన క్యాట్ కేంద్రానికి, ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లను అమిత్ గార్గ్, హరీష్‌కుమార్ గుప్తా, అతుల్ సింగ్, అభిషేక్ మొహంతి దాఖలు చేశారు. వీరు ఆంధ్ర ప్రభుత్వ పరిధిలో ప్రస్తుతం పనిచేస్తున్నారు. కేంద్ర సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా తమను ఆంధ్రకు కేటాయించారని వారు పిటిషన్లలో తెలిపారు. అనంతరం ట్రిబ్యునల్ ఈ కేసు విచారణను ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేసింది.