ఆంధ్రప్రదేశ్‌

నామినేషన్ల గడువు ముగిసే వరకు ఓటరు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 18: రానున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసే వరకు కొత్త ఓటరు నమోదు, నకిలీ ఓట్ల తొలగింపు కార్యక్రమాలు కొనసాగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. సచివాలయం ఐదవ బ్లాక్‌లో శుక్రవారం రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి ఈనెల 11వ తేదీన రూపొందించిన తుది ఓటర్ల జాబితా హార్డ్‌డిస్క్‌ను ఆయా పార్టీల ప్రతినిధులకు ద్వివేది అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాతో పాటు ఇతర ఏ సమస్యలైనా తమ దృష్టికి తీసుకువస్తే, తక్షణమే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు అన్ని పార్టీలకు సమాచారం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఈసీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అనంతరం సమస్యలపై పలువురు రాజకీయ నేతలు వివరించారు. సమావేశంలో టీడీపీ తరఫున ఏపీఎస్ ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్య, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నేత సూరిబాబు, బీజేపీ నాయకులు జూపూడి రంగరాజు, సీపీఎం నాయకులు ఎం కృష్ణమూర్తి, వై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.