ఆంధ్రప్రదేశ్‌

అమరావతికి స్టార్ హోటళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 18: రాజదానిలో ఎన్ని స్టార్ హోటళ్లు వస్తే అంత త్వరగా ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. విమానయాన సేవలు, కళాశాలలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కనె్వన్షన్ సెంటర్‌లే కొత్త నగరాల భవితవ్యాన్ని నిర్దేశించే వనరులన్నారు. శుక్రవారం సచివాలయంలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాథికార సంస్థ (సీఆర్డీఏ) సమావేశం సందర్భంగా 7 ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటళ్లకు భూ కేటాయింపు ధృవీకరణ లేఖలను ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోటళ్లు, కనె్వన్షన్ సెంటర్ల నిర్మాణాలతో అమరావతికి పూర్తిస్థాయి రాజధాని కళ వస్తుందన్నారు. 7 హోటళ్లలో 5 ఫైవ్‌స్టార్, ఒక ఫోర్‌స్టార్, ఒక తీస్టార్ హోటల్ ఏర్పాటు కానున్నాయి. జీవీ ఎస్టేట్స్ అండ్ హోటల్స్ (వివెంటా), ఓం శ్రీ భావనసాయి ఎల్‌ఎల్‌పీ (వెస్ట్ ఇన్), సదరన్ ట్రావెల్స్ (మ్యారియెట్), కాంథారి హోటల్స్ (్ఫర్చ్యూన్), ల్యాండ్‌బేస్ (జింజర్), స్వాగత్ మోటల్స్ (కీస్ సెలెక్ట్) ఇందులో ఉన్నాయి. దీంతో రాజధానిలో నిర్మాణమయ్యే హోటళ్ల సంఖ్య 16కు చేరుతుంది. అమరావతిలో కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ (డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్)ను గ్యాస్, నీరు, విద్యుత్, రోడ్, ఫైబర్ గ్రిడ్ తరహాలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు అంశంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఒక ఉన్నత స్థాయి బృందం గత కొద్దిరోజుల క్రితం పరిశీలనకు వచ్చి వెళ్లిందని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ ముఖ్యమంత్రికి వివరించారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఉన్న దుబాయ్ మెట్రోలోనూ, అబుదాబీలోని ఇథిహాద్ టవర్స్‌లోనూ ఈ వ్యవస్థ ఇప్పటికే విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. 40వేల టన్నుల సామర్థ్యంతో అమరావతిలో ఏర్పాటు చేస్తున్న డీసీఎస్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థగా నిలుస్తుందని చెప్పారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులను స్వయంగా వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున సందర్శకులు తరలివస్తున్నారని పురపాలకశాఖ మంత్రి పి నారాయణ తెలిపారు.
ప్రస్తుతం ఆర్టీసి బస్సుల్లో వస్తున్న వారి సంఖ్య రోజుకు నాలుగువేల వరకు ఉందని, మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నిత్యం పదివేల మంది సందర్శనకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశామని సీఆర్డీఏ కమిషనర్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సందర్శకుల కోసం ఉద్ధండరాయని పాలెంలో బేస్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సందర్శకులు స్నానాలు చేసేందుకు వీలుగా డ్రెస్సింగ్ రూమ్స్, భోజనాలు, అల్పాహారం అందిస్తున్నామని 36 మంది టూరిస్ట్ గైడ్స్‌ను నియమించామని వివరించారు. సందర్శకులకు గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రాజధాని సందర్శకులకు దుర్గగుడి దర్శనం ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని తెలిపారు.
రాజధానిలో జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లో రూ 23.15 కోట్లతో అడ్వొకేట్ బ్లాక్ సిద్ధమవుతోందని జ్యుడీషియల్ కాంప్లెక్స్‌కు అనుబంధంగా 71,506 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బ్లాక్‌ను నిర్మించాలని శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశం నిర్ణయించింది. రూ 23.15 కోట్ల అంచనా వ్యయంతో జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్లతో 140 క్యాబిన్లు, 16 షాపులుగా ఈ బ్లాక్ నిర్మాణాన్ని చేపట్టాలనే ప్రతిపాదనకు సమావేశం ఆమోదం తెలిపింది. ఒక్కో అంతస్తులో 35 చాంబర్ల చొప్పున నాలుగు అంతస్తుల్లో నిర్మాణాలు చేపడతారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగు కార్యాలయాలు, ఆడిటోరియం, లైబ్రరీ, సర్వీస్ రూమ్స్, కామన్ లాబీ ఏరియా, టాయిలెట్లు నిర్మిస్తారు. దీనికి త్వరలో టెండర్లు పిలవనున్నారు. రాజధాని గ్రామమైన వెంకటపాలెంలో రూ 448 కోట్లతో ఐటీ పార్క్ నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనకు సమావేశం ఆమోదం తెలిపింది. మొత్తం 14,21,000 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో చేపట్టే ఐటీ పార్క్‌లో పదిలక్షల చదరపు అడుగుల వరకు ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది. ఇందులో సగభాగం వాణిజ్యపరమైన కేటాయింపులు పోను, మిగిలిన సగ భాగాన్ని దిగ్గజ సంస్థల కోసం అందుబాటులో ఉంచుతామని సీఆర్డీఏ కమిషనర్ వివరించారు. ఒక సెల్లార్, 4 స్టిల్ట్స్, 15 పై అంతస్తులతో ఐటీ పార్క్ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రతిపాదించామన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు త్వరలో టెండర్లు పిలవనున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ కోసం ఫోస్టర్ ప్లస్ పార్టనర్స్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్‌కు సమావేశం ఆమోదం తెలిపింది.
హ్యాపీనెస్ట్ సిరీస్‌లో భాగంగా రెండవ ప్రాజెక్ట్ చేపట్టాలనే ప్రతిపాదనకు సమావేశం సానుకూలంగా స్పందించింది. మొత్తం 1704 ప్లాట్లు, 12 బ్లాక్‌లుగా ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు.
ఐనవోలు దగ్గర నిర్మాణం జరగనుంది. సెల్లార్, పోడియం, జీ ప్లస్ 23 విధానంలో దీన్ని చేపడతారు. రాజధానిలో 150 ఎకరాల్లో నిర్మాణ రంగ నగర నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రాథమికంగా సమావేశంలో అనుమతి లభించింది. దీన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తారు. నిర్మాణ ప్రణాళిక స్థాయి నుంచి నిర్మాణ సామగ్రి తయారీ వరకు కన్‌స్ట్రక్షన్ సిటీలో అందుబాటులో ఉంటాయి. నాణ్యతా నిర్ధారణ నియమావళిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధానకార్యదర్శి సతీష్ చంద్ర, సీఆర్డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.