ఆంధ్రప్రదేశ్‌

అరకులోయలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జనవరి 18: ప్రముఖ పర్యాటక కేంద్రమైన విశాఖ జిల్లా అరకులోయలో అంతర్జాతీయ హా ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్రా ఊటీ అరకులోయలో నిర్వహిస్తున్న అతి పెద్ద బెలూన్ ఫెస్టివల్‌ను పాడేరు ఐటీడీఏ పీవో డీకే బాలాజీ ప్రారంభించారు. గిరిజన యువకులతో కలిసి బెలూన్ బుట్టలో ఎక్కి విదేశీ ప్రతినిధుల సమక్షంలో గాలిలో విహరించారు. దేశంలోనే పెద్దదైన ఈ ఫెస్టివల్‌లో 15 దేశాలకు చెందిన ఔత్సాహికులు 20 హట్ బెలూన్లతో విన్యాసాలు ప్రదర్శించారు. అమెరికా, ఇంగ్లండ్, రష్యా, కెనడా, మలేషియా, స్విట్జర్లాండ్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా సహా పదిహేను దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్న బెలూన్ ఫెస్టివల్‌ను ఈ సారి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్వహిస్తున్న ఈ వేడుకకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేసారు. అరకులోయలో మొదటి సారి 2017 నవంబర్‌లో నిర్వహించిన బెలూన్ ఫెస్టివల్ వాతావరణం అనుకూలించక అనుకున్నంతగా విజయవంతం కాలేదు. భారీ వర్షాల కారణంగా ఈ ఉత్సవం పర్యాటకులను ఆకట్టుకోలేకపోయింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం ముందు జాగ్రత్తలు తీసుకుని బెలూన్ ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టారు. అరకులోయలో తొలిసారి నిర్వహించిన బెలూన్ ఫెస్టివల్‌ను మన దేశానికి చెందిన రెండు బెలూన్లు, పదమూడు దేశాల నుంచి పదహారు బెలూన్లు విన్యాసాల్లో పాల్గొన్నాయి. అయితే ఈ సారి మాత్రం పదిహేను దేశాలకు చెందిన ప్రతినిధులతో 21 బెలూన్లతో విన్యాసాలు చేపడుతూ చూపరులకు కనువిందు చేస్తున్నారు. దేశంలో 21 బెలూన్లతో ఈ ఉత్సవాలను నిర్వహించడం ఇదే ప్రథమం కావడం విశేషం. సముద్ర మట్టానికి అత్యంత ఎతె్తైన భాగంలో ఉన్న అరకులోయలో బెలూన్ ఫెస్టివల్ నిర్వహించడానికి అనుకూలంగా ఉండడంతో పర్యాటక శాఖ ఈ వేడుకకు ఈ ప్రాం తాన్ని ఎంపిక చేసుకుంది. ఈ నెల 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు నిర్వహించే బెలూన్ ఫెస్టివల్‌లో ప్రజలను భాగస్వామ్యం చేసా రు. అయితే దట్టంగా కురుస్తున్న పొగ మంచు, చలిగాలుల కారణంగా బెలూన్లను ఎగురవేసే సమయా ల్లో కొద్దిపాటి మార్పులు చేయాల్సి వచ్చింది. ఉద యం ఆరు గంటలకు బెలూన్లను ఎగురవేయాల్సి ఉండగా పొగ మంచు కారణంగా తొమ్మిది గంటలకు మార్పు చేసారు. బెలూన్ ఫెస్టివల్ ప్రారంభం రోజు విభిన్న ఆకారాలతో కూడిన బెలూన్లను ఎగురవేయడంతో పలువురు ఆసక్తిగా వీటిని వీక్షించారు. జోకర్, గుడ్డు, తేనెటీగ, బేబీ కారు ఆకారా లు గల బెలూన్లు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ బెలూన్లు గాలిలో నాలుగు వేల అడుగుల ఎత్తుకు ఎగిరి అమితంగా ఆకట్టుకున్నాయి. మూడు రోజుల పాటు జరిగే బెలూన్ ఫెస్టివల్‌కు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అరకులోయ పరిసర ప్రాంతాలకు చెందిన గిరిజనులు చలిని కూడా లెక్క చేయకుండా ఈ వేడుకలను వీక్షించేందుకు తరలివస్తుండడంతో ఈ ప్రాంతమంతా సందడిగా మారింది. బెలూన్ ఉత్సవం ప్రారంభోత్సవంలో పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ హిమాంశు శుక్లా, పర్యాటక శాఖ జిల్లా అధికారులు ప్రసాదరెడ్డి, పూర్ణిమాదేవి, ఫెస్టివల్ బృంద నాయకుడు కెప్టెన్ కరీముల్లా సయ్యద్, ఆర్గనైజర్ సుమిత్ గార్గ్, అఖిల భాతర అడ్వంచర్ టూర్ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.