ఆంధ్రప్రదేశ్‌

బెలూన్ ఫెస్టివల్‌తో అరకు ప్రతిష్ట విశ్వవ్యాప్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జనవరి 19: అంతర్జాతీయ స్థాయిలో విశాఖ జిల్లా అరకులోయలో నిర్వహిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌తో అరకులోయ ప్రతిష్ట విశ్వవ్యాప్తమైందని పర్యాటక శాఖ అఖిలప్రియ పేర్కొన్నారు.
మాడగడ పంచాయతీ దళపతిగుడ, బురిడిగుడ గ్రామాల సమీపంలో విదేశీ ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన గుడారాలలో ఆమె శనివారం విలేఖరులతో మాట్లాడుతూ పర్యాటకాభివృద్ధిలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ ప్రపంచవ్యాప్తంగా అరకులోయకు మంచి గుర్తింపు తీసుకొస్తుందన్నారు. గత సంవత్సరం నవంబర్‌లో మొదటిసారి నిర్వహించిన బెలూన్ ఫెస్టివల్ వాతావరణం అనుకూలించక ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదన్నారు. అయితే ఈ సారి నిర్వహిస్తున్న బెలూన్ ఫెస్టివల్ విజయవంతమైందని, ఈ విజయంతో ప్రతి సంవత్సరం అరకులోయలో బెలూన్ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఈ సారి పకడ్బందీ చర్యలు తీసుకుని ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామన్నారు. రెండో సారి నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారని, భవిష్యత్‌లో ఈ తరహా ఉత్సవానికి మరింత ఎక్కువ ఆదరణ లభించగలదన్నారు.
పర్యాటక ప్రాంతాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పేందుకు వీలుగా పలు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. అరుకులోయలో బెలూన్ ఫెస్టివల్, అమరావతిలో బుద్ధిజం, అనంతపురంలో లేపాక్షి, విశాఖపట్నంలో విశాఖ ఉత్సవ్ వంటి కార్యక్రమాలు చేపట్టి పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రాష్టవ్య్రాప్తంగా పర్యాటకుల సౌకర్యార్థం పది సరికొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టుల అమలుకు పర్యాటక బోర్టు సమావేశం అనుమతి లభించడంతో ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన స్థల సేకరణ పూర్తి చేసినట్టు మంత్రి చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లో అత్యాధునిక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సవాలుగా తీసుకుని శ్రమిస్తున్నట్టు ఆమె అన్నారు.
గత ప్రభుత్వాలు పర్యాటకపరంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో పర్యాటకుల సందర్శన అంతంత మాత్రంగానే ఉండేదని ఆమె చెప్పారు. తాను పర్యాటక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని పర్యాటకాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానన్నారు. గతంతో పోలిస్తే పర్యాటకుల సంఖ్య పెరగడమే కాకుండా ఆదాయం కూడా గణనీయంగా లభించినట్టు ఆమె తెలిపారు. విశాఖ మన్యంలో ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అఖిలప్రియ చెప్పారు.
చిత్రాలు.. విహరించేందుకు హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కిన మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి, * విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి అఖిలప్రియ, *హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ను తిలకించేందుకు వచ్చిన సందర్శకులు