ఆంధ్రప్రదేశ్‌

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 20: షెడ్యూల్ కులాల్లో వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యంతో కూడిన ఎస్సీ వర్గీకరణ అంశానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ఆదివారం గుంటూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కన్నా లక్ష్మీనారాయణకు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా కన్నా మాట్లాడుతూ వచ్చే ఫిబ్రవరి 19న నిర్వహించే మాదిగ విశ్వరూప సభకు ఏపీ బీజేపీ నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. సోమవారం విజయవాడకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వస్తున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఇచ్చేలా చట్టం తీసుకొచ్చేలా కృషిచేయాలని కోరతామన్నారు. అంతకుముందు మందా కృష్ణమాదిగ మాట్లాడుతూ దళితుల్లో అత్యంత వెనుకబడిన వర్గంగా మాదిగలు ఉన్నారని, ఎస్సీ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని కోరుతూ మాదిగ విశ్వరూప మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు.