ఆంధ్రప్రదేశ్‌

‘ప్రమాదమేమీ ఉండదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 20: రాజమహేంద్రవరంలోని ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్సులో కంటైనర్‌లో అపహరణకు గురైన రేడియో ధార్మిక మూలంవల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఓఎన్జీసీ అధికారులు స్పష్టంచేశారు. ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్సులోని లాగింగ్ యూనిట్ నుంచి 27 కిలోల బరువుగల ధ్రుడమైన కంటైనర్ బాక్స్‌తో పాటు ఆచూకీ తెలియకుండా పోయిన రేడియోధార్మిక మూలం సీఎస్-137 (2.5 క్యూరీ) శక్తి తగ్గిందని తెలిపారు. ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అసెట్ మేనేజర్ డిఎం ఆర్ శేఖర్ మాట్లాడుతూ ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ పేలబోదని స్పష్టం చేశారు. ఈ మూలం కంటైనర్ లోపల ఉన్నపుడు విడుదలైన అన్ని గామా కిరణాలు ఒకే దశలో ప్రసారం చేయబడతాయని, అన్ని దిశల్లో ప్రసారం చేయబడవన్నారు. మూలం కంటైనర్‌లో ఉన్నంత కాలం చాలా సురక్షితంగా ఉండి, ఎటువంటి ప్రభావంవుండదన్నారు. మూలం కంటైనర్ నుంచి తీసినపుడు విడుదలయ్యే గామా కిరణాలు రెండు మీటర్లకు మించి ప్రసరించవని, దానివల్ల ఆ పరిథికి మించి ప్రభావం ఉండదన్నారు.
ఈ విషయం ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్‌బీ) వెబ్‌సైట్‌లో కూడా తేల్చిచెప్పిందన్నారు. దీనిని ఏఈఆర్బీ నియంత్రిస్తుందన్నారు. ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఓఎన్జీసీ అధికారులు ఈ వనరును 20 ఏళ్లకు పైగా నిరంతరం ఉపయోగిస్తున్నారని అసెట్ మేనేజర్ డిఎంఆర్ శేఖర్ చెప్పారు.