ఆంధ్రప్రదేశ్‌

10 శాతం ‘ఈబీసీ’లోనే కాపుల రిజర్వేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: కేంద్రం ప్రకటించిన ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లలో కాపుల రిజర్వేషన్‌ను పొందుపరిచే అంశం పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కళా వెంకటరావు వెల్లడించారు. కేంద్రం సహకరించకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య తలెత్తుతోందని ఆరోపించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో సోమవారం మాట్లాడుతూ ఈబీసీలకు 10 రిజర్వేషన్ అంశంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లను కేటగిరీల వారిగా విభజించే అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి లేఖ రాశారన్నారు. కోల్‌కతా సభకు ఆహ్వానం ఉన్నా, కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఫ్రంట్ కట్టి ఓట్లను చీల్చాలన్న ఆలోచనే తప్ప, ప్రజల విషయంలో కేసీఆర్‌లో చిత్తశుద్ధి లేదన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 3 తేదీల్లో పింఛన్ల పండుగ నిర్వహిస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద మరో విడత 10 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రైతుకు పెట్టుబడి సాయం అంశం కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు.