ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికలే మన లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 21: రానున్న ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతలందరూ కష్టపడి సమన్వయంతో పనిచేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి స్థాయి పెరుగుతోంది.. ఇలాంటి తరుణంలో అంతా మరింత కష్టపడి పనిచేయాలి.. మీరు బాగుంటేనే నాయకుడుగా నాకు మంచి పేరు.. మీలో ఏ ఒక్కరు సక్రమంగా లేకపోయినా నాకే చెడ్డపేరు వస్తుంది.. ఎన్నికలే లక్ష్యంగా అంతా కష్టపడి పనిచేయాలి.. ఏ చిన్న లోపం జరక్కూడదు.. ఇప్పటి వరకు ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ఉద్ఘాటించారు. సోమ వారం ఉండవల్లి ప్రజావేదిక సమావేశ మందిరంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఎన్నికల వ్యూహంపై బాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 30 నుంచి జరిగే శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా సేకరించిన భావి అభివృద్ధి ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళతామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 1,2,3 తేదీలలో పింఛను పండుగ నిర్వహిస్తున్నామన్నారు. రాజమండ్రిలో జయహో బీసీ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. నెగటివ్ పబ్లిసిటీ ఎప్పుడూ పనిచేయదన్నారు. నాలుగేళ్లలో 6లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఒకరు.. 11 లక్షల కోట్లు జరిగిందని మరొకరు తమపై అభాండాలు వేస్తున్నారని బడ్జెట్‌కు మించిన అవినీతి జరిగిందంటే ప్రజలెలా నమ్ముతారని ప్రశ్నించారు. ‘మళ్లీ నువ్వే రావాలి’ అనే నినాదం ప్రజల నుంచి పుట్టుకొచ్చిందని దీంతో వైసీపీలో దడ పుట్టిందన్నారు. అందుకే నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని మండిపడ్డారు. నిన్నునమ్మం బాబు అనే ప్రచారం ఇందులో భాగమే అన్నారు. వైసీపీ నెగటివ్ భావజాల పార్టీ అని, ప్రతిపక్షనేత జగన్ నెగటివ్ లీడర్ అని ఎద్దేవా చేశారు. ఆరేళ్ల క్రితం వివాదంపై షర్మిలతో ఇప్పుడు ఫిర్యాదు చేయిస్తున్నారని, అందుకే ప్రజలు పట్టించుకోవటంలేదని స్పష్టం చేశారు. ప్రజల్లో పాజిటివ్‌నెస్‌కే ప్రాధాన్యత ఉంటుందన్నారు. సానుకూలతవైపే వారు మొగ్గుచూపుతారని ప్రతికూలతలను వ్యతిరేకిస్తారన్నారు. గత నాలుగున్నరేళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించాం.. పెద్దఎత్తున పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేశాం.. ఇంత అభివృద్ధి, సంక్షేమం ఏ రాష్ట్రంలో జరగలేదన్నారు. నీటిపారుదల ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తున్నామని, సీమ జిల్లాలకు సాగునీరందిస్తున్నామని పునరుద్ఘాటించారు. కేంద్రం తోడ్పాటు లేకున్నా స్వయంకృషితో రాష్ట్భ్రావృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఒక్కరోజులో లక్ష కోట్ల పెట్టుబడులు రావటం ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. జన్మభూమి కార్యక్రమం ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచిందని చెప్పారు. 5,65,000 వినతులు వచ్చాయని, అన్ని వర్గాల ప్రజల్లో విశేషమైన స్పందన లభించిందన్నారు. ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల పూర్తి సానుకూలత ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఏంచేయాలి.. రానున్న ఐదేళ్లకు అభివృద్ధికి, ప్రణాళికల రూపకల్పన..గ్రామ, జిల్లాల అభివృద్ధి ప్రణాళికల తయారీ.. రైతుల్లో ఏ విధంగా సాధికారత తీసుకురావాలి? పెట్టుబడులు తగ్గించటంపై దృష్టి సారించటం తమ భవిష్యత్ లక్ష్యాలుగా వివరించారు. మహిళా గ్రూపులు తన మానస పుత్రికలని, బీమామిత్ర, కళ్యాణ మిత్ర, గృహమిత్రలు బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. డ్వాక్రా మహిళలకు రూ 10వేలు పసుపు-కుంకుమ కింద ఇచ్చాం.. మరో రూ 10వేలు త్వరలో ఇస్తున్నామని వెల్లడించారు. పోలవరానికి పెండింగ్ నిధులు విడుదలచేయాలని, డీపీఆర్-2ను ఆమోదించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసినట్లు చెప్పారు. నెలరోజుల్లో చేస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకోలేదని విమర్శించారు. దేశం మొత్తం తిరిగినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హడావిడి చేశారని కోల్‌కతాలో 22 పార్టీలు హాజరైతే కేసీఆర్ ఎందుకురాలేదని ప్రశ్నించారు. ఆయనవన్నీ నాటకాలని విమర్శించారు. కేటీఆర్, జగన్ కూడా కొత్తనాటకానికి తెరతీశారని ధ్వజమెత్తారు. వాస్తవాలు ఎప్పుడూ దాచిపెట్టలేరు.. వైసీపీ గడియారాలపై కాగితం తొలగిస్తే టీఆర్‌ఎస్ బొమ్మలు బయటపడ్డాయని, వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్ ఏమిటనేది దీన్నిబట్టి అవగతమవుతోందని ఆరోపించారు. పెన్షన్‌ను రూ 2వేల నుంచి పెంచటంతో ప్రజల్లో వస్తున్న స్పందనపైనుంచి దృష్టి మళ్లించేందుకు షర్మిలతో ఫిర్యాదలు చేయించారని, కేటీఆర్‌తో జగన్ భేటీ కావటం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమన్నారు. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ప్రజలను రెచ్చకొట్టాలని చూసిందని, యూసీలు ఇవ్వలేదని దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. ఢిల్లీలో హోదా సాధన సమితి సభ్యులపై లాఠీచార్జి చేస్తే వైసీపీ కనీసం ఎందుకు ఖండించలేదని నిలదీశారు. కోల్‌కతా భేటీ దేశ ప్రజల మనోభావాలకు ప్రతిబింబం అన్నారు. బీజేపీపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు ఇది అద్దం పడుతోందన్నారు. మోదీ పాలనపై అన్నివర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దేశాన్ని బీజేపీ అప్పుల ఊబిలోకి నెట్టిందని ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా అప్పు 49 లక్షల కోట్ల నుంచి 82 లక్షల కోట్లకు చేరిందన్నారు. ఈబీసీలకు పదిశాతం రిజర్వేషన్ ప్రకటించినా ప్రజల్లో స్పందన లేదన్నారు. చుక్కల భూముల సమస్యలతో పాటు అసంపూర్తిగా మిగిలిన డ్రెయిన్లు, రోడ్లు, వేసవిలో తాగునీటి ఎద్దడిపై గుంటూరు, అనంతపురం, కృష్ణాజిల్లాల నేతలు ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందిస్తూ చుక్కల భూముల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామన్నారు. కాగా ఆటోలు, ట్రాక్టర్లకు పన్ను మినహాయింపు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని పార్టీ నేతలు తెలిపారు.

చిత్రం..టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
చేపల దిగుమతికి సహకరించండి
* బీహార్ ముఖ్యమంత్రికి చంద్రబాబు లేఖ

విజయవాడ: ఫార్మాలిన్ వినియోగంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిపుణుల చేత వాస్తవాలను పరిశీలించి ఆంధ్రప్రదేశ్ నుంచి చేపల దిగుమతికి అనుమతించాలని బీహార్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం లేఖ రాశారు. చేపలను నిల్వ ఉంచేందుకు ఫార్మాలిన్ వినియోగిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేయడం వల్ల చాలా నష్టపోతున్నామని, ఏపీలోని చేపల ఉత్పత్తిదారులు తన దృష్టికి ఈ సమస్యను తీసుకువచ్చారని తెలిపారు. మనిషి ఆరోగ్యానికి హాని చేసే ఫార్మాలిన్ ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలను ఇక్కడి వ్యాపార వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు.
ఇది ఏపీ ప్రతిష్టను దిగజార్చడమేనని, దీని ప్రభావం ఇరు రాష్ట్రాల వ్యాపార సంబంధాలపై కూడా పడుతుందని తెలిపారు. ఈ ఆరోపణలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వివిధ సంస్థలు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయని తెలిపారు. ఈ తనిఖీల్లో ఫార్మాలిన్, అమ్మోనియా వినియోగిస్తున్నట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల చేపల ఎగుమతులకు సంబంధించి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్సులను, ఇతర పర్యవేక్షణ సంస్థలను ఏర్పాటు చేసిందని వివరించారు. బీహార్ నుంచి నిపుణుల బృందం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి, నాణ్యత పరిశీలించేందుకు వీలుగా సహకారం అందించేందుకు ప్రతిపాదించామని తెలిపారు. బీహార్ రాష్ట్ర సరిహద్దుల్లో ఫార్మాలిన్ వినియోగానికి సంబంధించి పరీక్షలు చేసేందుకు వీలుగా కొంతమంది అధికార్లతో బృందాలను పంపేందుకు సిద్ధమని తెలిపారు. వాస్తవాలను పరిశీలించి, చేపల ఎగుమతులకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.