ఆంధ్రప్రదేశ్‌

విభజన హామీల అమలుకు 27 నుంచి జనఘోష రైలు యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం,జనవరి 21: విభజన హమీల అమలు, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల సమస్యలపై జనఘోషను ఢిల్లీలో వినిపించడంతోపాటు, ఈ నెల 31నుంచి ప్రారంభమయ్యే కేంద్ర బడ్జెట్ సమావేశాల వేదిక వద్డ నిరసన చేపట్టేందుకు ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో ఈనెల 27న విశాఖ నుంచి ‘జనఘోష రైలు యాత్ర’ను నిర్వహించనున్నారు. మాజీ ఎంపీ, ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ నేతృత్వంలో వివిధ పక్షాల నాయకులు, పలువురు మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులంతా కలసి ఈ యాత్రను నిర్వహించనున్నారు. ఈ యాత్రలో పలువురు మేధావులు, వివిధ సంఘాల రాజకీయ పార్టీ నాయకులు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై రూపొందించిన నివేదికలను ఢిల్లీలోని అన్ని శాఖల మంత్రులకు అందిస్తామన్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం చేపడుతున్న ఈ జనఘోష రైలు యాత్రను రాజకీయాలకు అతీతంగా పార్టీల ప్రతినిధులు, కార్మిక సంఘాలు తమ సంపూర్ణ మద్దతును తెలియజేయాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, ఉత్తరాంధ్ర,రాయలసీమ ప్రాంతాలకు బుందేల్‌ఖండ్ తరహలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కాపిటివ్ మైన్స్ కేటాయింపు, గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభం, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించాలని, పోలవరాన్ని పూర్తి చేయాడానికి కేంద్రమే అన్ని చర్యలు తీసుకొవాలని, ఉత్తరాంధ్రలో ఎయిమ్స్ తరహ ఆసుపత్రిని నెలకొల్పాలని, మాజీ ప్రధాని మనోహ్మన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హమీలను నేరవేర్చాలనే ప్రధాన డిమాండ్లతో ఈ రైలు యాత్రను చేపడుతున్నామని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు.
ఢిల్లీ కేంద్రంగా ఐదు రోజుల పాటు ఉత్తరాంధ్ర చర్చా వేదిక సభ్యులంతా నల్లదుస్తులు ధరించి కేంద్ర మంత్రులను, పార్లమెంట్‌లోని వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లను, ఎంపీలను కలసి వినతిపత్రాలను సమర్పించడంతో పాటు, ఆందోళన చేపట్టి వారిపై ఒత్తిడి తీసుకువచ్చి న్యాయం జరిగేలా పోరాడతామన్నారు. ఈ నెల 27న విశాఖ నుంచి వందలాది మంది మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులతో ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఉత్తరాంధ్ర ప్రతినిధి బృందం బయల్దేరి వెళ్తుందన్నారు.