ఆంధ్రప్రదేశ్‌

గోదావరి డెల్టాలో రబీకి నీటి గండం...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 22: గోదావరి డెల్టాలో రబీ సాగుకు నీటి గండం పొంచివుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 84 టీఎంసీల నీటితో సాగుచేయవచ్చనే అంచనాతో పూర్తి ఆయకట్టుకు అనుమతిచ్చారు. అయితే ఇప్పటికే ఇందులో సగం నీటిని ఉపయోగించేశారు. అయినా ఇంకా నాట్లు పూర్తికాలేదు. కనీసం పది శాతానికి పైగా నాట్లు పూర్తికావలసివుంది. మరో వైపు గోదావరి నదిలో నీటి లభ్యత రోజు రోజుకీ క్షీణిస్తోంది. ఈ నేపధ్యంలో అవసరమైన కీలకమైన దశల్లో నీటిని అందించడం ఎలా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. పూర్తిగా సీలేరుపైనే ఆధారపడే పరిస్థితి దాపురిస్తోంది. మంగళవారం ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 7.70 అడుగులు నమోదైంది. 13.02 మీటర్ల మేర నదీ గర్భంలో నీటి నిల్వలు వున్నాయి. తూర్పు డెల్టాకు 2500 క్యూసెక్కులు, మధ్యమ డెల్టాకు 1700 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 4300 క్యూసెక్కులు వంతున మొత్తం మూడు డెల్టాలకు 8500 క్యూసెక్కులు ఉభయ గోదావరి జిల్లాల కాల్వలకు విడుదల చేశారు. ఉభయ గోదావరి డెల్టాల్లో 8,96,533 ఎకరాల ఆయకట్టుకు రబీ సాగు చేపట్టారు. ఫిబ్రవరి, మార్చి నెలలు వరికి కీలక దశ. ఈ కాలంలో నీటి అవసరాలు అధికంగా వుంటాయి. దీంతో ఇప్పటి నుంచే పొదుపుగా వినియోగించుకునే విధంగా 25వ తేదీ నుంచి తూర్పు డెల్టాలో వంతుల వారీ నీటి సరఫరా విధానాన్ని చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ముందస్తు చర్యలు ఇప్పటి నుంచే జల వనరుల శాఖ తీసుకుంది. డిసెంబర్ ఒకటి నుంచి మార్చి నెలాఖరు వరకు రబీ పంట కాలంగా నిర్ధేశించారు. ఈ సమయంలో మొత్తం తాగునీటి అవసరాలకు కాకుండా కేవలం సాగునీటికి 84 టీఎంసీలతో గోదావరి డెల్టాల రబీ సీజన్‌ను గట్టెక్కించే విధంగా కార్యాచరణ ప్రణాళిక చేపట్టారు. అయితే ఇప్పటికొచ్చి ఇంకా నాట్లు పూర్తి కాకపోవడం వల్ల కీలక దశలో నీటి ఎద్దడి తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు అంటే రబీ కార్యాచరణ మొదలైన డిసెంబర్ మొదటి నుంచి జనవరి 22 వరకు మొత్తం 41 టీఎంసీలు సాగునీటి కాల్వలకు విడుదలచేశారు. ఇందులో సీలేరు జలాశయం నుంచి ఇప్పటి వరకు 17 టీఎంసీలు లభించింది. గోదావరి నదిలో 24 టీఎంసీల నీరు సహజ లభ్యతగావుంది. సీలేరు నుంచి ప్రస్తుతం సరాసరిగా నాలుగు వేల క్యూసెక్కుల వరకు లభిస్తోంది. మొత్తం 84 టీఎంసీలతో రబీని సాగు చేసేందుకు ప్రణాళిక రూపొందించగా ఇప్పటి వరకు విడుదల పోగా ఇంకా 43 టీఎంసీలే మిగిలాయి. ముందస్తు నాట్లు వ్యూహం సైతం ఫలించలేదు. మార్చి నెలాఖరుకు ఎట్టి పరిస్థితుల్లోనైనా కాల్వలు మూసేందుకు సంకల్పించారు.