ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా గత నాలుగు సంవత్సరాలుగా 1.51 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 270 కోట్లు ఖర్చు చేసినట్లు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య తెలిపారు. విజయవాడలో బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం జిల్లా స్థాయి ఆర్గనైజన్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు రూ. 285 కోట్లు కేటాయించారన్నారు. ఇందులో భాగంగా గత నాలుగు సంవత్సరాలుగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం వివిధ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా గాయత్రి విద్యా ప్రశస్తి పథకం కింద 761 మందికి రూ. 76 లక్షలు, భారతి విద్యా పథకం ద్వారా 88083 మందికి రూ. 117.36 కోట్లు, విదేశీ విద్యకు 224 మంది లబ్ధిదారులకు రూ. 21.35 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇంకా పలు పథకాల ద్వారా బ్రాహ్మణులకు లబ్ధి చేకూర్చామన్నారు. దీంతోపాటు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని రూ. 50 కోట్ల మూలనిధితో ఏర్పాటు చేసి బ్రాహ్మణ కుటుంబాలకు సూక్ష్మ రుణాలను అందిస్తున్నామన్నారు. సొసైటీ ద్వారా అరుంధతి స్వయం సహాయ పథకం ద్వారా 7074 మంది లబ్ధిదారులకు రూ. 10.57 కోట్లు, వశిష్ట స్వయం సేవ పథకం ద్వారా 3,781 మందికి రూ. 4.87 కోట్లు, 287 మంది అర్చకులకు రూ. 5.65 కోట్లు, 102 మంది లబ్ధిదారులకు ఇతర పథకాల కింద రూ. 10.33 కోట్లను సూక్ష్మ రుణాలను ఇచ్చామన్నారు. పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీ ఎం పద్మ, 13 జిల్లా స్థాయి ఆర్గనైజర్లు హాజరయ్యారు.