ఆంధ్రప్రదేశ్‌

బ్యాక్‌లాగ్ ఖాళీలు ప్రత్యేక నోటిఫికేషన్‌తో భర్తీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఎటువంటి అన్యాయం జరగకుండా రాజ్యాంగ పరిధికి లోబడి ఆయా సంస్థలు ఉద్యోగాలు భర్తీ చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. నగరంలోని ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులతో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాలలో పాటించాల్సిన నియమాలపై కమిషన్ చైర్మన్ కారెం శివాజీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కారెం శివాజీ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన ఏపీపీఎస్సీలో ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన ఉద్యోగాలను ఆయా వర్గాల వారికి చెందే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ నిర్దేశానుసారం ముఖ్యంగా 65, 66 జీవోల ప్రకారం 2019, మార్చి 31 లోపు ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందన్నారు. కాని ఏపీపీఎస్సీ బ్యాక్‌లాగ్ ఖాళీలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా జనరల్ రిక్రూట్‌మెంట్‌లో భర్తీకి చర్యలు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఏపీపీఎస్సీ పోస్టుల భర్తీలో చేపడుతున్న విధానాలతో ఎస్సీ, ఎస్టీలకు చెందిన అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందని కమిషన్‌కు ఫిర్యాదులు అందాయని అన్నారు. సమీక్షా సమావేశంలో అడిషనల్ సెక్రటరీ కళావతి, అసిస్టెంట్ సెక్రటరీ కేవీ ప్రసాద్, డిప్యూటీ సెక్రటరీ లాల్ మోతి, అసిస్టెంట్ సెక్రటరీ సోమరాజు తదితరులు పాల్గొన్నారు.