ఆంధ్రప్రదేశ్‌

మేడా ఓ గంజాయి మొక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరి టీడీపీపై విమర్శలు చేయడాన్ని మంత్రి ఆదినారాయణరెడ్డి ఖండించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డితో కలిసి మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ తాము గతంలో వెళ్లినప్పుడు పార్టీలో కొనసాగుతానని చెప్పిన ఎమ్మెల్యే మేడా ఇప్పుడు ఈ విధంగా మాట్లాడటం తగదన్నారు. మంగళవారం సీఎం వద్దకు వచ్చి సవివరంగా అన్ని విషయాలు చెబుతానని ఇంతలోనే ఈ విధంగా విమర్శలు చేయటం సరికాదన్నారు. గత ఆరు నెలల నుంచి తాము అనేక సందర్భాల్లో మేడా ప్రవర్తన గురించి ముఖ్యమంత్రికి వివరించామని అన్నారు. ఆయన నియోజకవర్గ పరిధిలో ఏది కావాలంటే అది ముఖ్యమంత్రి కేటాయించారని, ఇప్పుడు పార్టీ మారగానే ముఖ్యమంత్రి కార్యాలయం గంజాయి వనం అని మాట్లాడుతున్నారంటే లోటస్‌పాండ్ తులసి వనమా? అని ప్రశ్నించారు. రాజంపేట నియోజకవర్గ పరిధిలో అధికారుల అండతో రూ. 800 కోట్లతో అభివృద్ధి చేశామని మేడా మాట్లాడుతున్నారని, అధికారులకు నిధులు కేటాయించే అధికారం ఉంటుందా అని మంత్రి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రుల ఆదేశాలు అమలు చేయడం తప్ప నిధులు కేటాయింపు చేసే అవకాశం అధికారులకు లేదన్నారు. పదవులు తీసుకున్నప్పుడు, భోగాలు అనుభవించినప్పుడు టీడీపీ పార్టీ తులసీ వనమో, గంజాయి వనమో తెలియదా? అని ప్రశ్నించారు. టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ గత 6 నెలలుగా ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి రాత్రి వైసీపీ పార్టీలో, పగలు టీడీపీలో కాలం వెళ్లబుచ్చారని, దీనిపై ముఖ్యమంత్రికి సమాచారం చెప్పడంతో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారన్నారు. రాజంపేట నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. విలేఖర్ల సమావేశంలో జెడ్పీటీసీ రమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.