ఆంధ్రప్రదేశ్
కొనసాగుతున్న అల్పపీడనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 January 2019
విశాఖపట్నం, జనవరి 22: ఆగ్నేయ బంగాళాఖాతం, కింద నున్న భూమధ్య రేఖకు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. ఇది బలపడే అవకాశాలు పెద్దగా లేవని పేర్కొన్నారు. అయితే రానున్న రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు బుధవారం నాటికి రెండు డిగ్రీల తగ్గుముఖం పడతాయని తెలిపారు. గురువారం కూడా ఉష్ణోగ్రతల తగ్గుదల కొనసాగుతుందని పేర్కొన్నారు.