ఆంధ్రప్రదేశ్‌

కొలిక్కిరాని ‘విరాట్’ వ్యవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 20: విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విరాట్‌ను నౌకాదళ సేవల నుంచి త్వరలో ఉపసంహరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ ఆ నౌకను మ్యూజియంగా తీర్చిదిద్దే వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. ఈ నెల 23న ముంబయి నుంచి ఆఖరి సారిగా కొచ్చిన్‌కు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖలో మ్యూజియంగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ స్థలం ఎంపికపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఐఎన్‌ఎస్ విరాట్‌ను ఈ సంవత్సరాంతంలోగా భారత నౌకాదళ సేవల నుంచి ఉపసంహరించేందుకు నౌకాదళం ప్రతిపాదిస్తున్నది. ఇప్పటికే ఈ నౌకపై ఉండే విమానాల సేవలను ఉపసంహరించారు. దాదాపు 59 సంవత్సరాల పాటు దేశానికి సేవలందించిన ఈ నౌక చివరిసారిగా ముంబయి నుంచి కొచ్చిన్‌కు వెళ్లనుంది. ఈ నెల 27న కొచ్చిన్‌కు చేరుకున్నాక, ఉపసంహరణ వరకూ అక్కడే ఉంటుంది. విశాఖలో మ్యూజియంగా ఈ నౌకను తీర్చిదిద్దేందుకు వీలుగా ముఖ్యమంత్రి తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. ఈ భారీ నౌకను నిలిపి ఉంచేందుకు అనువైన స్థలం కోసం జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోంది. మ్యూజియం, స్టార్ హోటల్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఉపసంహరణ తరువాత నౌకను విశాఖకు కేటాయించడం, విశాఖలో అనువైన స్థలం ఎంపిక వ్యవహారాలు మాత్రం ఇంకా కొలిక్కిరాలేదు. ఈ నెల 23న నగరానికి రానున్న ముఖ్యమంత్రి పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.