ఆంధ్రప్రదేశ్‌

నూతన హైకోర్టుకు పటిష్ట భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: నూతన హైకోర్టుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ ఆదేశించారు. హైకోర్టు భవనాల ప్రారంభోత్సవం, భద్రతా తదితర చర్యలపై బుధవారం వెలగపూడి సచివాలయంలో ఆయన సమీక్షించారు. ఫిబ్రవరి 3న నూతన హైకోర్టు భవనాలను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైర్ సర్వీసులు, ట్రాఫిక్, పార్కింగ్, ప్రముఖుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులకు భద్రత కల్పించడంతో పాటు వారి రాకపోకలు సజావుగా సాగేలా చూడాలని హోం శాఖ కార్యదర్శి అనూరాధ ఆదేశించారు. వీఐపీల వాహనాలకు, ఇతర వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. భవనాలకు బయోఫెన్సింగ్ సహా పోలీస్ అవుట్‌పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రారంభోత్సవానికి దాదాపు 5000 మంది హాజరయ్యే అవకాశం ఉందని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు.