ఆంధ్రప్రదేశ్‌

శిశువు కిడ్నాప్ కేసులో ఐదుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో పసికందు కిడ్నాప్ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మగబిడ్డ కోసమే ఐదురోజుల పసికందును ఆస్పత్రి వార్డు నుంచి మహిళ కిడ్నాప్ చేసినట్లు నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ తెలిపారు. అయితే ఇందుకు సహకరించిన ఆస్పత్రి రికార్డు అసిస్టెంట్‌తోపాటు వార్టు సెక్యూరిటీ గార్డులు, సదరు మహిళ భర్తను కూడా కటకటాలకు వెనక్కు నెట్టారు. ఇదిలావుండగా ఈఘటన నేపధ్యంలో ప్రభుత్వాస్పత్రి నిర్వహణా డొల్లతనం పోలీసు దర్యాప్తులో వెల్లడైందని, సిబ్బంది నిర్లక్ష్యం, వైఫల్యాలపై ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనున్నట్లు సిపి చెప్పారు. కమిషనరేట్‌లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన అయితా కళ్యాణి, సుబ్రహ్మణ్యం దంపతుల ఐదు రోజుల మగశిశువు ఈ నెల 14న పాత ప్రభుత్వాస్పత్రిలోని ఇంకుబ్యేటర్‌లో మాయమైన విషయం తెలిసిందే. అవనిగడ్డకు చెందిన కొండవీటి నాగమల్లేశ్వరీ (27), ఆమె భర్త మద్దా జ్యోతి స్వర్జన రాజు (29)లతోపాటు ప్రభుత్వాస్పత్రి రికార్డు అసిస్టెంట్ శ్రీను (51) వీరికి సహకరించిన సెక్యూరిటీ గార్డులు ముఖర్జి, కన్నయ్యలను అరెస్టు చేశారు. ముందు రెండు పెళ్ళిళ్ళు, ఇద్దరు ఆడపిల్లలకు తల్లయింది. విషయాన్ని భర్త వద్ద దాచిపెట్టిన మల్లేశ్వరి తనకు గర్భం వచ్చినట్లు నమ్మించింది. కాన్పు కోసం చెన్నై వెళ్తున్నట్లు చెప్పి చెన్నై ప్రభుత్వాస్పత్రిలో బిడ్డ కోసం విఫలయత్నం చేసింది. ఆ తర్వాత విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో రికార్డు అసిస్టెంట్ శ్రీనుతో పరిచయం ఏర్పరుచుకుని అతనితోపాటు, సెక్యూరిటీ గార్డుల సహకారంతో ఈ నెల 14న బిడ్డను అపహరించి ఇంటికి తీసుకెళ్లి తనకు పుట్టినట్లుగానే భర్తను నమ్మించింది. నిందితురాలికి సహకరించిన ప్రభుత్వాస్పత్రి రికార్డు అసిస్టెంట్ శ్రీనును విధుల నుంచి శాశ్వతంగా తొలిగించినట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు.