ఆంధ్రప్రదేశ్‌

భారీ దారిదోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, జూలై 21: నెల్లూరు జిల్లాకేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న వెంకటాచలం టోల్‌ప్లాజా సమీపంలో దారిదోపిడీ జరిగింది. చెన్నై నుంచి నెల్లూరుకు కారులో బంగారం తీసుకుని వస్తుండగా గుర్తుతెలియని దుండగులు కారును అడ్డగించి అందులోని వారిని కత్తులు, కర్రలతో బెదిరించి కారుతో పాటు లోపల ఉన్న 3.5 కిలోల బంగారంతో పరారయ్యారు. నెల్లూరు బాలాజీ నగర్‌కు చెందిన పాదర్తి శ్రీకాంత్ చిన్నబజార్‌లోని కాకర్లవారి వీధిలో బంగారు దుకాణం నిర్వహిస్తున్నాడు. శ్రీకాంత్ గురువారం ఉదయం తన స్నేహితుడు కమ్మ జయరామయ్యతో కలిసి చెన్నైలో బంగారం కొనుగోలు చేసేందుకు హుందాయ్ ఎక్స్‌యనెట్ (ఎపి 26 బిఎ 1238) కారులో వెళ్లాడు. సుమారు కోటి 5 లక్షలు విలువ చేసే 3.5 కిలోల బంగారం కొనుగోలు చేసి నెల్లూరుకు తిరిగి వస్తుండగా సాయంత్రం సుమారు 7గంటల సమయంలో రిలియన్స్ పెట్రోల్ బంకు వద్ద టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే టిఎన్ 01 ఎసీ 7075 నెంబరు గల ఇన్నోవా కారును వీరు ప్రయాణిస్తున్న హుందాయ్ కారుకు అడ్డుగా నిలిపారు. కారు ఆగడంతో ఇన్నోవా కారులో నుంచి గుర్తుతెలియని ముగ్గురు దుండగులు కింద దిగారు. వీరి హుందాయ్ కారు వద్దకు వచ్చి కారులో నుంచి కిందకు దిగాలంటూ మారణాయుధాలతో భయపెట్టారు. భయపడిన శ్రీకాంత్, జయరామయ్య కారులో నుంచి దిగగా శ్రీకాంత్ మెడలోని చైన్‌ను కూడా లాక్కున్నారు. కారు నుంచి దూరంగా వెళ్లాలంటూ కత్తులతో బెదిరించారు. తరువాత బంగారం ఉన్న హుందాయ్ కారును తీసుకుని దుండగులు నెల్లూరు వైపు పరారయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.