ఆంధ్రప్రదేశ్‌

3వేల ఎకరాల్లో సిరామిక్ సిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 22:ఆంధ్రప్రదేశ్‌లో సిరామిక్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. కృష్ణ, గోదావరి జిల్లాల్లో ఏదైనా అనువైన ప్రదేశంలో మూడు వేల ఎకరాల్లో సిరామిక్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గుజరాత్‌లోని మోర్బీ నుంచి వచ్చిన సిరామిక్ పారిశ్రామికవేత్తలతో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. గుజరాత్‌కు మించి ఏపిలో సానుకూల వాతావరణం ఉందని సిఎం వారికి చెప్పారు. నిరంతర విద్యుత్ సరఫరా, పుష్కలంగా నీరు, భూమి, వ్యాపార సరళీకరణ, విస్తారంగా ఖనిజసంపద, ప్రభావవంతమైన మానవ వనరులు ఇక్కడ ఉన్నాయని సిఎం చెప్పారు. మరో రెండు నెలల్లో స్థలాన్ని ఎంపిక చేసి సిరామిక్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌కు భూమిపూజ చేస్తామని చెప్పారు. గ్యాస్ సరఫరా తమకు ప్రధాన సమస్యగా ఉందని సిరామిక్ ఉత్పత్తిదారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, కాకినాడలో ఎల్‌ఎన్‌జి గ్యాస్ టెర్మినల్ ఏర్పాటవుతోందని, అలాగే, గ్యాస్ పైప్‌లైన్ల పనులు శరవేగంగా సాగుతున్నాయని ఆయన వివరించారు. 30 వేల కోట్ల సిరామిక్ మార్కెట్, నాలుగు వేల కోట్ల శానిటరీ మార్కెట్ కలిగి ఉన్న ఈ పరిశ్రమకు రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ అతి పెద్ద కూడలిగా మారనున్నదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గోదావరి, కృష్ణా జిల్లాలలను సిరామిక్ హబ్‌గా మార్చేందుకు దోహదం చేసే సిరామిక్ పాలసీని తీసుకొస్తామని సిఎం చెప్పారు. మోర్జీలో ఎంతోమంది ఆంధ్రులు సిరామిక్ వ్యాపారం చేస్తున్నారని, వారంతా స్వరాష్ట్రానికి రావాలని సిఎం విజ్ఞప్తి చేశారు.

తయారీ రంగంలో మరో ముందడుగు
తయారీ రంగంలో జపాన్‌కు చెందిన అతిపెద్ద కంపెనీ మయొకవ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తికనబరచింది. పరిశ్రమలకు అవసరమైన శీతలీకరణ కంప్రెషర్ల తయారీలో పేరొందిన మయొకవ ఏపిలో వెయ్యి కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సంస్థ చైర్మన్ యొషిరో తనక శుక్రవారం విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబును కలసి చర్చించారు. కంప్రెషర్లు, శీతలీకరణ వ్యవస్థ, హీట్ పంపులు, ఫ్రీజర్లు, గ్యాస్ కంప్రెషర్లు, ఫుడ్ రోబోటిక్స్ రంగాల్లో తమకున్న నైపుణ్యాన్ని, ఖ్యాతిని సిఎంకు యోషిరో వివరించారు. చేపలు, మాంసం, పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఆయిల్, గ్యాస్, కెమికల్, కోల్డ్ స్టోరేజ్ రంగాల్లో మయొకవ అద్భుత ప్రగతి సాధించిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మయొకవ యూనిట్ నెలకొల్పేందుకు ఇదే సరైన సమయమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అంతర్జాతీయంగా తమకున్న అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్‌కు అందించాలని ఆయనను కోరారు. ముందుగా అసెంబ్లింగ్ యూనిట్ నెలకొల్పి, అనంతరం తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే చెన్నైయ్‌లో యూనిట్ నెలకొల్పిన మయొకవ, మైకామ్ కంప్రెషర్లను ఫ్రిక్ పేరుతో దేశీయ మార్కెట్‌లో విక్రయిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా ఆధారిత ప్రాసెసింగ్ ప్రాజెక్ట్‌లతో అధికంగా మైకామ్ కంప్రెషర్లను వినియోగిస్తున్నారు.
chitram...
జపాన్‌కు చెందిన మయొకవ ప్రతినిధులతో చర్చిస్తున్న చంద్రబాబు