ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు దీక్షకు ప్రజా మద్దతు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 11: ప్రత్యేక హోదా కోసం చేస్తున్నట్లు చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షకు ప్రజా మద్దతు లేదని, అది స్వార్థపూరిత దీక్ష అని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా సంజీవని కాదన్న ముఖ్యమంత్రి అదే ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్నట్లు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తన కొడుకు ఆర్థిక స్థోమత పెంచేందుకు పోలవరం ప్రాజెక్టు విలువను 16 వేల కోట్ల నుండి 54 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. ప్రధాని స్థాయి వ్యక్తి రాష్ట్రానికి వస్తే గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రులపై ఉంటుందని, గతంలోనూ ఎన్‌టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ రాష్ట్రానికి వస్తే ఆయన వెంట ఎన్‌టీ రామారావు కరవు ప్రాంతాల్లో పర్యటించారని గుర్తు చేశారు. ప్రధాని కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రివర్గంలోని శిద్దా రాఘవరావు, నక్కా ఆనంద్‌బాబులను ముఖ్యమంత్రి ఆదేశిస్తే వారు కూడా కార్యక్రమానికి డుమ్మా కొట్టారని, ముఖ్యమంత్రి ఆదేశాలు పాటించని మంత్రులిద్దరిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.