ఆంధ్రప్రదేశ్‌

స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 11: విధి నిర్వహణలో అలసత్వాన్ని అంగీకరించబోమని, రానున్నది ఎన్నికల సమయం కాగా, అబ్కారీ సిబ్బంది నిజాయితీతో సేవలు అందించాలనని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. తాను ఇచ్చే స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి మొదలు సాధారణ కానిస్టేబుల్ వరకు నిబద్ధతతో వ్యవహరించకపోతే సస్పెన్షన్, ఉద్యోగం నుండి తొలగింపు వంటి చర్యలకు వెనుకాడబోతనన్నారు. విజయవాడ ప్రసాదంపాడులోని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ కార్యాలయంలో ఉప కమిషనర్‌లు, సహాయ కమిషనర్‌లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లతో సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్‌నాయుడు, అదనపు కమిషనర్ భాస్కర్ తదితరులతో కల్సి 13 జిల్లాల అధికారులతో మీనా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ రానున్న నాలుగు నెలలు కీలకమైనదని, అబ్కారీ శాఖపై ఎన్నికల సంఘం పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రతి జిల్లాలోనూ ఎక్సైజ్ శాఖకు ఇకపై కంట్రల్ రూమ్ ఉండాలని దానిని తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి మద్యం విక్రయ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దశల వారీగా వాటిని రాష్ట్ర ఎక్సైజ్ కార్యాలయానికి అనుసంధానం చేయాలన్నారు.