ఆంధ్రప్రదేశ్‌

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఫిబ్రవరి 11: సంతలో పశువుల్లా 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీ వెళ్లి సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియా అంటున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తన రాజకీయ స్వార్థం కోసం పాకులాడుతున్న చంద్రబాబు మాటలు, చేతలు చూసి మోసపోవద్దన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదానే వైసీపీ సిద్ధాంతమన్నారు. హోదా సాధించే దిశగా గత ఐదు సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు మరో మూడు రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీలో కొంగ దీక్ష చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, రాష్ట్రం ఆర్థికంగా వృద్ధి చెందాలన్నా ప్రత్యేక హోదా కావాల్సిందేనన్నారు. హోదా కోసం గుంటూరులోనూ, ఢిల్లీలోనూ నిరాహార దీక్షలు చేసి, పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ధర్నాలు, బంద్‌లు చేస్తే నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు తమను హేళన చేసిన విషయాన్ని బొత్స గుర్తు చేశారు. చంద్రబాబు వైఖరి సరైనది కాదని, వైసీపీ ఎప్పటి నుండో చెబుతూనే ఉందన్నారు. అమరావతి శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన మరునాడే వైసీపీ స్పందించిన తీరును ఈ సందర్భంగా బొత్స గుర్తుచేశారు. మట్టికుండతో రాష్ట్రానికి ఏమీ ఒరగదని ఆనాడే చెప్పామన్నారు. కేంద్రంతో ఘర్షణ వాతావరణం ఉండకూదంటూ టీడీపీ కాలయాపన చేసిందన్నారు. మరో పదిరోజుల్లో పార్లమెంట్ అయిపోతుంటే ఎవర్ని మోసం చేయటానికి బాబు ఈ దీక్షలు చేస్తున్నారని ప్రశ్నించారు. విభజనకు ముఖ్యకారణం కాంగ్రెస్సే అన్న బాబు నేడు ఆ పార్టీతోనే జత కట్టారన్నారు. మోదీ, బాబు ఒకరినొకరు తిట్టుకుంటున్నారని, వ్యక్తిగతంగా మీలో మీకు రాజకీయ ఒప్పందాలు ఏమున్నాయో రాష్ట్ర ప్రజలకు అవసరం లేదన్నారు. అందరికీ కావాల్సింది రాష్ట్ర శ్రేయస్సు మాత్రమేనన్నారు. మోదీ వచ్చి మాయమాటలు చేప్పారని ఒకరు...నాలుగున్నరేళ్లు కాపురం చేసి బాబు అవినీతిపరుడు అని మరొకరు విమర్శలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏం మేలు చేశారని, రాష్ట్రానికి ఏం వచ్చింది, రాష్ట్రానికి ఏం సాధించాం అనేది మాత్రం ఈ రెండు పార్టీల్లో కనిపించలేదన్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా, ఏ విధంగా కించపరిచినా, ఏ విధంగా కుతంత్రాలు చేసినా తమకు అనవసరం అంటూ, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదానే వైసీపీ సిద్ధాంతమని స్పష్టం చేశారు. బాబు దీక్షల కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. దీక్షలు చేయాలంటే వైసీపీని హేళన చేయలేదా అన్నారు.
ఎంపీలు రాజీనామాలు చేస్తే హేళన చేయలేదా అని ప్రశ్నించారు. నాడు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసినట్లైతే ఎంపీలు ఒకే అంశం మీద ఉన్నారని దేశం మొత్తం దద్దరిల్లేదన్నారు. ఆ మాత్రం అలోచన బాబుకు లేదన్నారు. సీనియర్‌ను అని చెప్పకుంటున్న చంద్రబాబు తన సీనియార్టీతో రాష్టన్రికి ఒక్క మేలు అయినా చేశారా అని బొత్స ప్రశ్నించారు. బాబు స్వార్థం కోసం... టీడీపీ సౌలభ్యం కోసం..కార్యక్రమాలు చేస్తూ, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి హత్యారాజకీయాలు ప్రోత్సహిస్తూ, నేడు మాత్రం నీతులు చెబుతున్నారని ఆరోపించారు. ఇటువంటి మాటలు, చేతలకు రాష్ట్ర ప్రజలు మోసపోవద్దన్నారు. హోదా తెచ్చే వారిని, అమరావతి నిర్మించి ఇచ్చే వారిని మాత్రమే వచ్చే ఎన్నికల్లో గెలిపిద్దామని బొత్స పిలుపు ఇచ్చారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న వైకాపా నేత బొత్స సత్యనారాయణ