ఆంధ్రప్రదేశ్‌

బాబు పాలనలో అన్ని రంగాలూ నిర్వీర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలనలో విద్య, వైద్యం, ఉపాధి తదితర అన్నిరంగాలు నిర్వీర్యమయ్యాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. అనంతపురం నగరంలోని ఓ హోటల్‌లో సోమవారం నిర్వహించిన వివిధ రంగాలకు చెందిన 300 మంది తటస్థులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై తన విజన్‌ను తెలిజేస్తూ చర్చించారు. ముఖ్యంగా విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సమస్య, ఉపాధి హామీ పథకంలో లోటుపాట్లు, నిరుద్యోగం తదితర అంశాలను తటస్థులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే పెనుకొండ వద్ద ఏర్పాటు చేసిన కియా కార్ల కంపెనీలో స్థానికుల ఉద్యోగాలు లభించడం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అన్ని అంశాలు విన్న జగన్ మాట్లాడుతూ వాచ్‌మెన్, స్వీపర్లకే అనంతపురం నిరుద్యోగులకు పరిమితం చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. కియా కార్ల కంపెనీ ఉండీ ప్రయోజనం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నించడం వారి పరిస్థితిని తెలియజేస్తోందన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 75 శాతం జిల్లావాసులకే కియాలో ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తెస్తామని భరోసా ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను విస్తృతంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఈ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను, హాస్టళ్లను మూసివేస్తోందని, విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలు అందివ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, వైద్య సదుపాయాలు పెంచుతామని, నిర్వీర్యమైన వివిధ ప్రభుత్వ రంగాల్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామన్నారు.
ఉపాధి హామీ పథకంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి, కూలీలకు బకాయిలు చెల్లిస్తామన్నారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత నెలకొనడం సిగ్గుచేటన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుంటే కాలేజీలు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఆస్పత్రులన్నీ వృథా అనే ధోరణిలో టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్‌బాబు కనుసన్నల్లో నడుస్తున్న మెడాల్ సంస్థకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్తపరీక్షల కాంట్రాక్టు పనులు అప్పగించిందని, తద్వారా తండ్రీకొడుకులు ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్‌కేయూనివర్సిటీ లా డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ పుల్లారెడ్డి, డాక్టర్ మనోరంజన్, ధర్మవరం నుంచి వచ్చిన భరత్‌రెడ్డి తదితరులు విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాల్లో నెలకొన్న సమస్యలను జగన్‌తో పంచుకున్నారు.

చిత్రం..అనంతపురం నగరంలో సోమవారం జరిగిన తటస్థుల సమావేశంలో ప్రసంగిస్తన్న వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి