ఆంధ్రప్రదేశ్‌

జనసేనలో తమిళనాడు మాజీ సీఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఫిబ్రవరి 11: తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి పీ రామ్మోహన్‌రావు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడ గాయత్రినగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యాక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రామ్మోహన్‌రావును జనసేన పార్టీ రాజకీయ సలహాదారుగా పవన్‌కళ్యాణ్ నియమించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అన్నాడీఎంకే ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను నిర్వహించిన రామ్మోహన్‌రావు నాటి ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఎటువంటి ఆటుపోట్లు లేకుండా ప్రభుత్వాని సమర్థవంతంగా నడిపారని గుర్తు చేశారు. ఎన్నో ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలయ్యేలా దిశానిర్దేశం చేశారన్నారు. అటువంటి మంచి వ్యక్తి తనపైన ఉన్న నమ్మకంతో జనసేన పార్టీకి అండగా నిలబడ్డారని చెప్పారు. పార్టీ బలోపేతం అవుతోంది అనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఆయనకున్న అపార అనుభవం పార్టీకి దిశానిర్దేశం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల్లో, పబ్లిక్ పాలసీల రూపకల్పనలో, ఎలక్షనింగ్‌లో రామ్మోహన్‌రావు అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆయన విలువైన సూచనలు, సలహాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఏపీకి బంగారు భవిష్యత్తును అందిస్తామన్నారు.
ఏపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: రామ్మోహన్‌రావు
జనసేన పార్టీ రాజకీయ సలహాదారు రామ్మోహన్‌రావు మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ క్షిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు.
తమను రక్షించడానికి ఎవరో ఒకరు రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్న తరుణంలో పవన్ రాజకీయ రంగ ప్రవేశం చేశారన్నారు. ప్రజల ఆకాంక్షలు, చారిత్రక అవసరాలు పవన్‌ను ఇటుగా తీసుకువచ్చాయన్నారు. మానవసేవే మాధవసేవ అని నమ్మిన పవన్ వంటి వ్యక్తులు సమాజంలో చాలా అరుదుగా ఉంటారన్నారు. సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్‌గా కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా, ప్రజలకు సేవ చేయాలన్న తపనతో పవన్ రాజకీయాల్లోకి వచ్చినట్లు గుర్తు చేశారు. యువకులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాల కోసం పవన్ రేయింబవళ్లు కష్టపడుతున్నారని చెప్పారు. పవన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి, పార్టీని అధికారంలోనికి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎంతో అనుభవం ఉన్న రామ్మోహన్‌రావు భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఆయన అనుభవం పార్టీని మరింత ముందుకు తీసుకు వెళ్తుందన్నారు.