ఆంధ్రప్రదేశ్‌

విజయనగరంలో గురజాడ అప్పారావు వర్సిటీ, వైద్య కళాశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 13: విజయనగరం జిల్లాలోని ఆంధ్రా వర్సిటీ పీజీ సెంటర్‌ను రాష్ట్ర వర్సిటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ వర్సిటీకి గురజాడ అప్పారావు వర్సిటీగా పేరు నిర్ణయించింది. ఈ వర్సిటీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పని చేయడం ప్రారంభిస్తుంది. విజయనగరం కేంద్రంగా ఈ వర్సిటీ పని చేస్తుంది. విజయనగరం పట్టణంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పని చేసేలా కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కూడా పాలనా ఆమోదాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది. విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు పాలనా ఆమోదం తెలిపింది. విజయనగరం ప్రభుత్వం ఆసుపత్రి స్థాయి 100 సీట్ల వైద్య కళాశాల ఏర్పాటుకు సరిపోతుందని అధికార వర్గాలు తెలిపారు. 380 మందికి సరిపడా హాస్టళ్ల నిర్మాణం సహా ఇతర సౌకర్యాల కల్పనకు 266 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు అనుమతి మంజూరు చేసింది.