ఆంధ్రప్రదేశ్‌

ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా హరికుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 13: రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా సీనియర్ పోలీసు అధికారి ఐజీ పీ హరికుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన అవినీతి నిరోధక శాఖ రాష్ట్ర డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇక్కడి నుంచి ఈయన్ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ అదనపు డైరెక్టర్‌గా బైరా రామకోటేశ్వరరావు నియమితులయ్యారు. ప్రస్తుతం జాయింట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆయనకు పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

నిర్భయ పథకం కింద రూ.6.62కోట్లు మంజూరు
రాష్ట్రంలో నిర్భయ పథకం కింద బాధితులకు నష్టపరిహారం నిమిత్తం ప్రభుత్వం రూ.6.62 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనూరాధ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా పరిహారాన్ని బాధితులకు ఆయా జిల్లాల్లోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించాల్సి ఉంటుంది.