ఆంధ్రప్రదేశ్‌

ఈవీఎంలు, వీవీప్యాట్లపై అవగాహన కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 13: రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు, వీవీప్యాట్లపై ప్రజలకు వివరించాలని, ఇందుకోసం అవగాహన సదస్సులు నిర్వహించాలని వివిధ జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయం నుంచి 13 జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల నిర్వహణపై సీఎస్ బుధవారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న ఓటర్లకు సరిపడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఉన్నాయా.. లేదా అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని అడిగి తెలుసుకున్నారు. వికలాంగుల కోసం ర్యాంప్‌లు ఏర్పాటు చేయాలని, వారి కోసం ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఏ క్షణానైనా రావొచ్చని, ఎక్కడైనా బదిలీలు పెండింగ్‌లో ఉంటే తక్షణమే పూర్తి చేయాలని, మిగిలిన ఆరు జిల్లాల కలెక్టర్లు ఈ నెలాఖరులోగా బదిలీలు చేయాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఆదేశాలు ఎప్పటికప్పుడు అమలు చేయాలన్నారు.
22న రాష్టప్రతి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 22వ తేదీ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో రాష్టప్రతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టప్రతి, ఉప రాష్టప్రతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రుల వంటి అత్యంత ప్రముఖుల పర్యటనలకు సంబంధించి విధిగా చేయాల్సిన ఏర్పాట్లన్నింటినీ ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా పటిష్టంగా చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆయన స్పష్టం చేశారు. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, ప్రోటోకాల్ అదనపు కార్యదర్శి కల్నల్ అశోక్‌బాబు రాష్టప్రతి పర్యటనకు సంబంధించి వివిధ శాఖల వారు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.