ఆంధ్రప్రదేశ్‌

ఉపాధి హామీలో అగ్రస్థానం మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 13: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 8వేల కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిపామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఐటీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారాలోకేష్ అన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం రాష్టస్థ్రాయి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం భవిష్య ప్రణాళికా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సారథ్యంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా గడచిన నాలుగున్నర ఏళ్ళలో ఉపాధిహామీ పథకంలో గ్రామాల్లో 24 వేల కిలోమీటర్ల సీసీరోడ్లను, 11వేల కిమీ గ్రావెళ్ల రోడ్లను నిర్మించామన్నారు. గతంలో ఎనిమిదేళ్ళ కాలంలో లక్ష పంటకుంటలు తవ్వగా, తమ ప్రభుత్వం నాలుగున్నర ఏళ్ళలో 6.15 లక్షల పంటకుంటలు తవ్వించిందన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే లక్ష పంటకుంటలు తవ్వించామన్నారు. గతంలో 3.50 లక్షల మరుగుదొడ్లు నిర్మించగా తమ ప్రభుత్వంలో 9.16 లక్షల మరుగుదొడ్లను నిర్మించామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 9600 చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు, అదే విధంగా అంగన్‌వాడీ భవనాలు, 2115 గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించామని, 2300 శ్మశానవాటికలను అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో 163 కిమీ మేర ప్రహారీ గోడల నిర్మాణం, పట్టణ ప్రాంతాల్లో, మేజర్ గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మిస్తున్నామన్నారు. గృహనిర్మాణశాఖ ద్వారా ఉపాధిహామీ అనుసంధానంతో 2.25 లక్షల గృహాలను నిర్మించి 90 రోజులు చొప్పున పనిదినాలు కల్పించామన్నారు. గ్రామాల్లో చంద్రన్నకాంతి కింద 12,918 పంచాయతీల్లో 25 లక్షల ఎల్‌ఇడి వీధి దీపాలు ఏర్పాటు చేశామన్నారు. స్వచ్ఛ్ధార కార్యక్రమం కింద మంచినీటి ట్యాంకులు క్లీనింగ్ చేపట్టామని, 2022 నాటికి 22వేల కోట్లతో రాష్ట్రంలో ప్రతి పేదవాని ఇంటికి కుళాయిని అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఈ ఏడాదిలో పంచాయతీరాజ్ శాఖద్వారా 12వేల పనులు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖలకు 650 అవార్డులు రాగా ఒక్క పంచాయతీరాజ్ శాఖకు 102 అవార్డులు రావడానికి పంచాయతీరాజ్, ఉపాధి హామీ సిబ్బంది ఒక సైన్యంలా పని చేయడమే కారణమన్నారు. ఉపాధిహామీ పనుల్లో దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏపీని అగ్రగామిగా నిలిపామన్నారు. ఈ అభివృద్ధిలో భాగస్వాములుగా ఫీల్డ్ అసిస్టెంట్ల బాగా పని చేశారని మంత్రి తెలిపారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం భవిష్య కార్యాచరణ
గ్రామీణ ఉపాధిహామీ పథకం భవిష్య కార్యాచరణ ప్రణాళికపై మంత్రి లోకేష్ వివరిస్తూ 2022 నాటికి అన్ని గ్రామ పంచాయతీలు 10 స్టార్ రేటింగ్ సాధించడం, నూరుశాతం సీసీరోడ్డు, అన్ని హేబిటేషన్‌ల్లో బీటీ రోడ్డు, ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ, 2వేల లోపు జనాభా గల గ్రామాల్లో హాక్‌పిట్స్, 2వేల పైగా జనాభా ఉన్న గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి, నూరుశాతం అంగన్‌వాడీ భవనాలు, పాఠశాలల ప్రహారీగోడల నిర్మాణం, 50శాతం గ్రీనరీని పెంచడం, లింక్‌రోడ్లను డస్టుఫ్రీ రోడ్లగా మార్చడం, వాటర్ గ్రిడ్ క్రింద ఉచిత నీటి కుళాయిలను అందించడం లక్ష్యంగా నిర్ణయించినట్లు వివరించారు. పంచాయతీరాజ్ శాఖలో చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న పదోన్నతుల సమస్యలను పరిష్కరించామన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆఫీసు సబార్డినేట్స్‌కు, డ్రైవర్లకు జీతాలు పెంపు, ఉపాధి హామీ సిబ్బందికి ప్రమాదబీమా 5 లక్షలు, చంద్రన్న బీమా 5లక్షలు మొత్తం 10 లక్షలు బీమా సౌకర్యం కల్పించామన్నారు. వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సౌకర్యం నిమిత్తం హెల్త్ కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపారు. 133 జీవోపీఆర్టీ పోస్టులను భర్తీ, జెడ్పీ సూపరింటెండెంట్స్‌కు గెజిటెడ్ హోదాను కల్పించామని మంత్రి లోకేష్ తెలిపారు.
రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, గృహ నిర్మాణశాఖల మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ 2029 నాటికి దేశంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధికి చిరునామాగా నిలబెట్టే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్ళగా ఉపాధి హామీలో రూ. 25వేల కోట్లతో 100 కోట్ల పని దినాలు, ఆస్తులు కల్పించాలనే లక్ష్యంతో పని చేశామన్నారు. పంచాయతీరాజ్ శాఖ సంచాలకులు రంజిత్ బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి దూరదృష్టితో 25 శాఖల సమన్వయంతో కన్వర్జెన్సీ ఉపాధి హామీ పనులు చేస్తున్నామన్నారు. ఈ సదస్సులో కృష్ణా, విజయనగరం జిల్లాల జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు గద్దే అనురాధ, స్వాతిరాణి, ఎమ్మెల్సీ వైబి రాజేంద్రప్రసాద్, ముడాచైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జనరల్ సెక్రటరీ జి ధర్మ, జేఏసీ చైర్మన్ యం రామచంద్రయ్య పాల్గొని ప్రసంగించారు. అనంతరం నాలుగు సంవత్సరాల ఉపాధి హామీలపై లఘచిత్రం సీడీ ఆవిష్కరణ, ఉపాధిహామీ క్యాలెండర్, ఉపాధిహామీ చట్టం, సాంకేతిక మార్గదర్శిని పుస్తకాల మంత్రి లోకేష్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోనేరు శ్రీ్ధర్, 13 జిల్లాల డ్వామా పీడీలు సహాయ పీడీలు, ఉపాధి హామీ, పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు.