ఆంధ్రప్రదేశ్‌

స్మార్ట్ సిటీల నిర్మాణంలో పర్యావరణ హిత టెక్నాలజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 13: స్మార్ట్‌సిటీల నిర్మాణంలో పర్యావరణ హిత టెక్నాలజీని వినియోగించాలని స్మార్ట్ దుబాయ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఐషా బిన్ బిష్ అభిప్రాయపడ్డారు. విజయవాడలో బుధవారం ప్రారంభమైన సంతోష నగరాల సదస్సులో ఆమె కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్మార్ట్ సిటీలో అత్యాధునిక సౌకర్యాలు ఉండాలన్నారు. సంతోష నగరాల నిర్మాణంలో డేటా భద్రత, నగరాల డిజైన్, సాధికారత, దీర్ఘకాలిక ప్రణాళిక, నాయకత్వం వంటివి కీలమన్నారు. తాము బహుళ అంతస్తుల భవనాల్లో భద్రతకు ప్రాధన్యం ఇస్తున్నామన్నారు. దుబాయ్‌లో కాగిత రహిత పాలన అమలు చేస్తున్నామన్నారు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుందన్నారు. ఆసుపత్రుల్లో డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేస్తున్నామని వెల్లడించారు. పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పిడబ్య్లుసీ మిడిల్ ఈస్టు గ్లోబల్ లీడర్ సీటీస్ ప్రతినిధి హేజమ్ గలాల్ మాట్లాడుతూ వివిధ సమస్యలకు స్మార్ట్ నగరాలు పరిష్కార వేదికలన్నారు. పట్టణాలకు 2050 నాటికి 2.5 మిలియన్ల మంది ఏటా వలస వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ సిటీల రూపకల్పన చేయాల్సి ఉందన్నారు. ఎంటిఐ సింగపూర్ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్ మాట్లాడుతూ మార్పు అనివార్యం అయినప్పుడు నగరాలను సంతోషంగా ఉంచేందుకు నిరంతరం కొత్తదనం సృష్టించాల్సి ఉంటుందన్నారు. యువ నగరంగా అమరావతి అభివృద్ధి చెందుతోందని, కొత్త ఆవిష్కరణలు జరగాల్సి ఉందన్నారు. ఘనా దేశానికి చెందిన అకట్సి నార్త్ నగర మేయర్ ప్రిన్స్ సోడోకె అముజు మాట్లాడుతూ ఘనాలో చాలా స్మార్ట్ సిటీలను నిర్మిస్తున్నామన్నారు. అమరావతి చూశాక అటువంటి నగరం ఘనాలో నిర్మించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియన్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ మైకేల్ కోస్టా మాట్లాడుతూ పెట్టుబడులకు సంబంధించి ప్రాధాన్యతా రంగాలను గుర్తించామన్నారు. ఇందులో భాగంగా ఏపీలో వౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నామన్నారు. థింపూ (్భటాన్) మేయర్ కినే్ల డోర్జే మాట్లాడుతూ భూటాన్ సంతోస సూచిని గణనీయంగా పెంచేందుకు తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయన్నారు. 2010లో ప్రజల సంతోష సూచి 73 శాతం ఉండగా, 2015 నాటికి 85 శాతానికి చేరిందన్నారు. దీనిని నిలబెట్టుకునేందుకు సరైన ప్రణాళిక అవసరమన్నారు. అమెరికా కాన్సుల్ జనరల్ కేథరీన్ హడ్డా మాట్లాడుతూ భారత్‌లో ఏటా 20 మిలియన్ల మంది పట్టణాలకు వలస వస్తున్నారన్నారు. ప్రతి ఏటా చికాగో జనాభా అంత జనాభా పట్టణాలకు వలస వస్తున్నారని, ప్రతి సంవత్సరం దాదాపు కొత్త చికాగో నగరం నిర్మించాల్సి ఉంటుందన్నారు. వీటిలో సౌకర్యాలు కల్పించేందుకు 10 సంవత్సరాల్లో 64 లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయన్నారు. భారత్‌లో మూడు నగరాలను స్మార్ట్ నగరాలను చేసేందుకు సహకరిస్తున్నామని తెలిపారు.