ఆంధ్రప్రదేశ్‌

చమురు, సహజవాయువులను పరిరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 13: చమురు, సహజవాయు నిక్షేపాల పరిరక్షణకు అందరూ అవగాహన కలిగి ఉండాలని ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-అసెట్ మేనేజర్ డిఎం ఆర్ శేఖర్ అన్నారు. చమురు, సహజవాయు సహజ వనరుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ బుధవారం నగరంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అసెట్ మేనేజర్ డిఎం ఆర్ శేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి జీవన శైలి, ప్రత్యామ్నాయ మార్గనిర్దేశకం కోసం సైక్లింగ్ సంకేతంగా ఉంటుందన్నారు. సైక్లింగ్ ద్వారా ఇంధనం, డబ్బు కూడా ఆదా చేయడమే కాకుండా, ఆరోగ్యకరమైనదిగా ఉంటుందన్నారు. వాహన ఉద్గారాలను తగ్గిస్తూ, రద్దీని తగ్గించడం, ట్రాఫిక్ రద్దీని మెరుగుపర్చడం వంటివి చేయడమేనని అన్నారు. ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు 2022 నాటికి ఓఎన్జీసీ చమురు దిగుమతులను 10 శాతం తగ్గించడానికి కట్టుబడి కృషిచేస్తోందన్నారు. రాజమహేంద్రవరం ఓఎన్జీసీ ప్రత్యామ్నాయ వనరులను నిర్మించడానికి చేపట్టిన సంస్థ ప్రయత్నాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తాటిపాకలో ఐదు మెగావాట్ల సౌర ప్లాంట్‌కు ఇటీవల పునాది వేసినట్టు ఈడీ అసెట్ మేనేజర్ డిఎం ఆర్ శేఖర్ చెప్పారు. ఓఎన్జీసీ తన కార్యాలయాల్లో కాగిత రహిత కార్యకలాపాలను నిర్వహిస్తోందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి స్వచ్ఛ అభియాన్ మిషన్లో భాగంగా సింగిల్ ఉపయోగ ప్లాస్టిక్‌ను క్రమంగా తగ్గించాలని శేఖర్ అన్నారు. ఇంధన పరిరక్షక సందేశాలతో కూడిన టీషర్టులను 200 మంది ధరించి సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. చమురు, సహజవాయు వనరులను కాపాడేందుకు, ప్రచారం చేస్తూ ప్రతిజ్ఞ చేశారు.
సైకిల్ ర్యాలీ మోరంపూడి జంక్షన్, షెల్టన్ హోటల్, రామాలయం సెంటర్, ఏవీ అప్పారావు రోడ్, పోలీస్ క్వార్టర్స్ మీదుగా ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ చేరుకుంది. ఇంధన పరిరక్షణ కోసం బుర్రకధ బృందం ద్వారా ప్రచారం నిర్వహించారు. ర్యాలీలో సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. ఇంధన పరిరక్షణ సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న ఓఎన్జీసీ ఈడీ అసెట్ మేనేజర్ డిఎం శేఖర్