ఆంధ్రప్రదేశ్‌

ఢిల్లీ థీక్ష ఓ చరిత్ర: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తాను దేశ రాజధాని ఢిల్లీలో చేసిన ధర్మపోరాటం ఓ చరిత్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ ఓ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ జాతీయ స్థాయిలో గతంలోనూ, ప్రస్తుతం కూడా పోరాటాలు చేసిన చరిత్ర ఉందన్నారు. బుధవారం పార్టీ ముఖ్య నేతలతోనూ, నియోజకకవర్గాల ఇన్‌చార్జీలతోనూ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఢిల్లీ ధర్మాపోరాటంలో ఇద్దరు మాజీ ప్రధాన మంత్రులు, కేంద్ర మాజీమంత్రులు, అన్నింటికీ మించి 17 పార్టీల నేతలు తమకు సంఘీభావం పలికారంటే ఎంతో గర్వకారణమన్నారు. అలాగే ఉద్యోగ, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు మద్దతు పలికారంటూ కృతజ్ఞతలు వెల్లడించారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో బలంగా గొంతెత్తడం ఇదే ప్రథమమన్నారు. అది కూడా టీడీపీ ద్వారానే సాధ్యమైందన్నారు. ఇక దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. అంతేకాకుండా దీనికి అన్ని వర్గాల మద్దతును కూడగట్టాలన్నారు. మున్ముందు కూడా తమ ధర్మపోరాటాన్ని మరింత స్ఫూర్తివంతంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఇక బీజేపీ తన ఇష్టం ప్రకారం చేస్తే సహించేది లేదు, అలాగే వారి దుర్మార్గ పాలన కూడా సహించేది లేదంటూ బాబు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ మాజీముఖ్యమంత్రి అఖిలేష్‌పై ఆంక్షలు ఆ పార్టీ దుర్మార్గానికి పరాకాష్టగా అభివర్ణించారు. రాఫెల్ కుంభకోణంలో ఆ పార్టీది అంతర్జాతీయ అప్రదిష్ట అన్నారు. తాళాలు దొంగలకిచ్చి కాపలాదారు కుమ్మక్కయిన వ్యవహారంలా ఉందన్నారు. మోదీని తామేదో అవమానించామనే ప్రచారాన్ని పార్టీ నేతలు ఖండించాలన్నారు. బీజేపీ నేతలు బరి తెగించారు కాబట్టే ఎవరికి వారు తమ ఇష్టమొచ్చినట్లు... అదీ ఏ మాత్రం సంకోచం లేకుండా దుర్మార్గాలు చేస్తున్నారు, అలాగే మాట్లాడుతున్నారని బాబు అన్నారు. నేరాలు చేసే వారికి కనీసం కొంత మేర పశ్చాత్తాపం ఉంటుందని, అయితే ఇక్కడ తప్పుడు పనులు చేసే వారే తమపై వైకాపా, టీఆర్‌ఎస్, బీజేపీలతో కలిసి ఎదురు నిందలు చేస్తుంటే ఇక వౌనంగా ఉండాలా అంటూ బాబు ప్రశ్నించారు. ఏదిఏమైనా బీజేపీ, వైకాపా, టీఆర్‌ఎస్‌ల ముసుగు తొలగిపోయిందన్నారు. కేంద్రం తోడ్పాటు లేకుండానే ఈ రాష్ట్రంలో ఎన్నో పనులు చేసామని బాబు అన్నారు. ఓ లక్ష కోట్లతో రైతులకు, మరో లక్ష కోట్లతో పేదలకు సంక్షేమం చేసామన్నారు. వివిధ ప్రాజెక్టులకు రూ. 68వేల కోట్లు ఖర్చు, యువతకు 11 లక్షల ఉద్యోగాలు, ఉపాధి, రైతులు, మహిళలు, యువతకు న్యాయం.. ఇలా మనం చేసిన పనులే తెలుగుదేశం పార్టీకి శ్రీరామరక్ష అన్నారు. వీటన్నింటికీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రధానంగా ప్రతి ఒక్కరితో అభిమానం, అప్యాయతతో మెలుగుతూ ప్రజలందరితో ప్రతి నిమిషం మమేకం కావాలన్నారు. విశ్వసనీయత ఒక్క రోజులో వచ్చేదికాదన్నారు. ఏళ్ల తరబడి నమ్మకంతో వచ్చేదంటూ ... ఐదు కోట్ల ప్రజల్లో తమ పార్టీ నిబద్ధతపై ఎంతో నమ్మకం ఉందన్నారు. ఇక కార్యకర్తల బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానన్నారు. అలాగే కష్టపడి పని చేసే వారందరికీ గుర్తింపునిస్తానన్నారు. ఏదిఏమైనా ఈ రాష్ట్రంలో టీడీపీ శాశ్వతంగా అధికారంలో ఉండాల్సిందేనన్నారు. తమ ప్రభుత్వం చేసిన పనులపై ప్రజల్లో 80 శాతం సంతృప్తి ఉంది, అలాగే పార్టీకి ఇలాగే 80 శాతం మద్దతు ఉండేలా చూడాలని బాబు చెప్పారు.