ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో పాలన ముగిసినట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 14: రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ముగిసినట్లేనని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. మార్చిలో ఏడు జిల్లాల్లో శాసనమండలి సభ్యుల ఎన్నిక జరగాల్సి ఉన్నందున అందుకు సంబంధించిన షెడ్యూల్ నేడో, రేపో విడుదల కావచ్చని వారంటున్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో శాసనమండలి ఎన్నికలు జరగనున్నాయి. ఈ జిల్లాల్లో పూర్తిస్థాయిలో ఎన్నికల నిబంధనలు అమలులోకి వస్తున్నందున అక్కడి ప్రజాప్రతినిధుల పాలనకు తెరపడినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. ఇక మిగిలిన ఆరు జిల్లాల్లో పాక్షికంగా ఎన్నికల నిబంధనలు అమలులో ఉంటాయని, అయితే ప్రభుత్వ పాలన ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయి నిర్ణయాలు ఏవీ తీసుకుని ప్రకటించడానికి నిబంధనలు అడ్డువస్తాయని వారు వెల్లడిస్తున్నారు. మండలి ఎన్నికలు జరగని ఆరు జిల్లాల్లో అభివృద్ధి పథకాలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించడం, అవసరమైతే కమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వారంటున్నారు. ఈ జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ కొనసాగుతుందని అయితే నిబంధనలకు లోబడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. శాసనమండలి షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని వారు గుర్తుచేస్తున్నారు. దాంతో రాష్టవ్య్రాప్తంగా పూర్తిస్థాయి ఎన్నికల నియమావళి అమలులోకి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచి రాష్టవ్య్రాప్తంగా ప్రజాప్రతినిధులు ప్రొటోకాల్ కోల్పోతారని వారంటున్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులు తాజా మాజీలవుతారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇంకా పదవీకాలం ఉన్న శాసనమండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ ప్రొటోకాల్ పరిధిలోకి రారని స్పష్టం చేస్తున్నారు. శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ముగిసినట్లేనని వారు వెల్లడిస్తున్నారు.
5 నెలలు అభివృద్ధికి దూరం!
రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలంటే జూన్ నెలాఖరు వరకూ ఆగాల్సిందే. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో మార్చి నెలలో జరిగే శాసనమండలి సభ్యుల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఒకటి, రెండు రోజుల్లో విడుదల కానుంది. ఆ తరువాత ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్‌సభ, శాసనసభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ పాలనకు తెరపడనుంది. ఫలితంగా మే నెలాఖరు వరకూ ప్రభుత్వం నిర్ణయాలు ఏవీ తీసుకోవడానికి వీలుకాదు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ ఎన్నికలను ప్రభుత్వం ఏదో ఒక కారణం చేత వాయిదా వేస్తే తప్ప ఎన్నికలు అనివార్యం. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడినా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే మరో 45 రోజులు పాలన స్తంభించే పరిస్థితులు ఏర్పడతాయి. ఫలితంగా జూన్ చివరి వరకూ కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉండదు. రాష్ట్రంలో మే నెలలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం కొలువుదీరేంత వరకూ వారం, పది రోజుల పాటు పాలనకు అవకాశం ఉన్నా కొత్త ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు ప్రకటనకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని విశే్లషకులు వెల్లడిస్తున్నారు. శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు శంకుస్థాపనలు, సంక్షేమ పథకాలు అధికారికంగా అమలైతే తప్ప ఎన్నికల నిబంధనల నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేస్తున్నారు.